Bharat Jodo yatra 2.0: భారత్ జోడో యాత్ర 2.0 ను ప్రారంభించాలనుకుంటున్నాం: జైరాం రమేశ్

Published : Feb 27, 2023, 05:56 AM IST
Bharat Jodo yatra 2.0: భారత్ జోడో యాత్ర 2.0 ను ప్రారంభించాలనుకుంటున్నాం: జైరాం రమేశ్

సారాంశం

Bharat Jodo yatra 2.0:భారత్ జోడో యాత్ర విజయవంతమైన తర్వాత పాసిఘాట్ నుండి పోర్ బందర్ వరకు తూర్పు-పశ్చిమ భారత్ జోడో యాత్ర లాంటి మరో యాత్రను చేయాలని కాంగ్రెస్ పరిశీలిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరామ్ రమేశ్ అన్నారు. అయితే, దాని ఫార్మాట్ కొద్దిగా భిన్నంగా ఉంటుందని అన్నారు.

Bharat Jodo yatra 2.0: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగిన భారత్ జోడో యాత్ర విజయవంతమైంది. దేశ వ్యాప్తంగా ఈ యాత్రకు మంచి ఆరాధన లభించింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం అనుకున్న లక్ష్యాలను సాధ్యమైనంత వరకు పూర్తి చేసిందనే చెప్పాలి.  ఈ యాత్ర విజయవంతం అయిన తరువాత.. భారత్ జోడో యాత్ర రెండో విడతను ప్రారంభించేందుకు కాంగ్రెస్  సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.

ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు.. భారత్ జోడో యాత్ర 2.0 ఉంటుందనడానికి ఊతమిస్తున్నాయి. తాజాగా రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  జైరాం రమేష్ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర 2.0 పై కీలక వ్యాఖ్యలు చేశారు. 

పాసిఘాట్ నుండి పోర్‌బందర్‌కు ప్రయాణించే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోందని అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4 వేల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మరో యాత్రపై పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారని రమేష్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్ నుండి గుజరాత్‌లోని పోర్‌బందర్ వరకు తూర్పు-పశ్చిమ యాత్రను పరిశీలిస్తున్నట్లు రమేష్ తెలిపారు. కానీ, భారత్ జోడో యాత్రకు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చని అన్నారు.

ప్రస్తుత పరిస్థితిల్లో ఈ పర్యటన అవసరమని నేను వ్యక్తిగతంగా కూడా భావిస్తున్నాను అని జైరాం రమేష్ అన్నారు. కానీ తూర్పు-పశ్చిమ ప్రయాణాల నమూనా దక్షిణ-ఉత్తర భారతదేశం జంట ప్రయాణానికి భిన్నంగా ఉండవచ్చనీ, భారత్ జోడో యాత్ర కోసం సమీకరించబడిన అంత విస్తృతమైన మౌలిక సదుపాయాలు ఈ యాత్రలో ఉండకపోవచ్చని ఆయన అన్నారు. ఇది తక్కువ మంది ప్రయాణీకులను తీసుకువెళ్లడం కూడా జరగవచ్చు. ఇది మల్టీ మోడల్ యాత్ర అని, అయితే, చాలా ఈ  యాత్ర  చాలా వరకు పాదయాత్ర అని, అయితే ఈ మార్గంలో అడవులు, నదులు ఉన్నాయని అన్నారు. 

ఏప్రిల్‌లో కర్నాటకలో ఎన్నికలు, జూన్‌లో వర్షాలు, ఆ తర్వాత నవంబర్‌లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జూన్‌ నుంచి లేదా నవంబర్‌లోపు యాత్రను ప్రారంభించవచ్చని ఆయన చెప్పారు. భారత్ జోడో యాత్ర కంటే ఈ యాత్ర తక్కువ వ్యవధిలో ఉంటుందని రమేష్ తెలిపారు. మరి కొన్ని వారాల్లో దీనిపై  అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆలాగే పాదయాత్రకు సంబంధించి పూర్తి విషయాలపై అప్పుడే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !