విపక్ష ఐక్యతపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి? తృణమూల్ పై రాహుల్ దాడి.. ‘కూటమి కావాలనుకుంటున్నాం’

Published : Feb 24, 2023, 07:41 PM IST
విపక్ష ఐక్యతపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి? తృణమూల్ పై రాహుల్ దాడి.. ‘కూటమి కావాలనుకుంటున్నాం’

సారాంశం

ప్రతిపక్షాల ఐక్యత గురించి రోజూ ఆయా పార్టీల నేతలు కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, తాజాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఈ చర్చకు ఓ కుదుపు వచ్చింది. మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్నీ ఐక్యంగా పోటీ చేయాలని భావిస్తుండగా.. మేఘాలయాలో రాహుల్ గాంధీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు.  

రాయ్‌పూర్: 2024 లోక్ సభ ఎన్నికలపై ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలనే మాటలు పలు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. ఆ ఐక్య కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించాలని కొన్ని పార్టీలు కోరుతుండగా అందుకూ తాము సిద్ధమేనని ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు కూడా. కానీ, తాజాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో చర్చ మళ్లీ మొదటికి వచ్చినట్టు తెలుస్తున్నది. విపక్షాల ఐక్యతపై కాంగ్రెస్‌కు నమ్మకం ఉన్నదా? లేదా? అసలు ఆ పార్టీ నాయకత్వం వహించాలని అనుకుంటున్నదా? లేదా? అనే ప్రశ్నలు కొందరు విమర్శకులు సంధిస్తున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పార్టీ సీనియర్ నేతలు విభేదించి విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు ఏమన్నారో ఓ సారి చూద్దాం.

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున్ ఖర్గే విపక్షాల ఐక్యత గురించి బహిరంగంగా మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత సాధిస్తామని, ‘అన్ని పార్టీల’తో తాము చర్చలు జరుపుతామని అన్నారు. విపక్షాలు ఐక్యంగా బరిలోకి దిగితే వంద మంది మోడీలు, అమిత్ షాలు వచ్చినా సరే ఆపలేరని తెలిపారు. కాగా, అదే మేఘాలయలో రెండు  రోజుల తర్వాత రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్న వైఖరిని వెల్లడిస్తున్నాయి.

ఆయన తృణమూల్ కాంగ్రెస్ పై విమర్శలు సంధించారు. ‘మీకు టీఎంసీ చరిత్ర తెలిసిందే. బెంగాల్‌లో హింస, స్కామ్‌ల గురించి తెలుసు. వారి సంప్రదాయం గురించి మీకు అవగాహన ఉన్నది. గోవాలో భారీ మొత్తంలో వారు ఖరర్చు పెట్టారు. దాని వెనుక ఒకే ఒక లక్ష్యం ఉన్నది. అది బీజేపీకి సహాయం  చేయడం. అదే ఐడియా ఇప్పుడు మేఘాలయాలో కూడా వారు అమలు పర్చడానికి చూస్తున్నారు. ఇక్కడ బీజేపీని బలపడేలా చూసి అధికారానికి వచ్చేలా చేయాలనుకుంటున్నారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Also Read: క్రియాశీల రాజ‌కీయ‌ల‌కు గుడ్ బై.. చివ‌రి శ్వాస‌వ‌ర‌కు బీజేపీతోనే.. : య‌డియూర‌ప్ప

ఈయన వ్యాఖ్యలు ఇలా ఉండగా.. ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో మూడు రోజుల మేధోమధన సదస్సు సందర్భంలో అక్కడ వీరప్ప మొయిలీ మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరితో విభేదించారు. తమ మధ్య ఉన్న విభేదాలను తొలగించుకుంటామని అన్నారు. మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, కేసీఆర్ వంటి వారితో కూటమి ఏర్పాటు చేస్తామని వివరించారు. తామంతా కలిసి అందరూ ఒక చోట చేరడానికి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, బలంగా ఉంటేనే కూటమికి సారథ్యం  వహించడం తేలిక అవుతుంది గదా అంటూ అన్నారు. 

రాహుల్ గాంధీ కచ్చితంగా పార్టీకి విలువైన ఒక ఆస్తి అని తెలిపారు. తాను కాంగ్రెస్‌లో 60 సంవత్సరాలుగా ఉంటున్నారని, దాని నిజమైన బలాలు, బలహీనతలు తనకు తెలుసు అని వివరించారు. తామంతా కలిసే పని చేస్తామని చెప్పారు. వీరప్ప మొయిలీ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్‌పర్సన్. ఈ కమిటీనే కూటముల గురించి డీల్ చేస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం