
Chief Minister Basavaraj Bommai: కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మునిగిపోతున్న ఓడ అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. బుధవారం బెంగళూరులోని డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ జిల్లా స్టేడియంలో 'జన్ సంకల్ప యాత్ర'ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జన సంకల్ప యాత్రను ప్రారంభించింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ఎదుర్కోవడానికి బీజేపీ ఈ యాత్రను ప్రారంభించింది.
జన సంకల్ప యాత్రను ప్రారంభ వేడుకలకు హాజరైన సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. దళితులు, అణగారిన వర్గాలు, విద్యార్థులు, మహిళలు, యువకుల భవిష్యత్తుకు భరోసా కల్పించిన వారు భయపడరనీ, అక్రమాలకు పాల్పడే వారు భయపడుతున్నారని అన్నారు. గత 50 ఏళ్లలో చేయనిది తమ బీజేపీ ప్రభుత్వం చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు)లకు వరుసగా 2, 4 శాతం రిజర్వేషన్లను పెంచుతూ తన ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని విప్లవాత్మకంగా పేర్కొంటూ, గత 50 ఏళ్లలో ఏం చేయలేదు అంటూ ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
"మీ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చేందుకు మీరు (కాంగ్రెస్) లోకాయుక్తను మూసివేసి, అవినీతి నిరోధక శాఖను ప్రారంభించారు. ఇప్పుడు లోకాయుక్త బలోపేతం చేయబడింది. మీ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. మీరు చేసిన లోపాలు.. కమీషన్‌లన్నింటినీ విచారించి శిక్షిస్తాం. దోషులకు అవార్డులు.. కాంగ్రెస్ అవినీతి ఇప్పుడు బయటపడుతుంది’’ అని సీఎం బొమ్మై అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో కర్ణాటక హైకోర్టు లోకాయుక్త అధికారాలను పునరుద్ధరించింది. కొన్ని రోజుల తర్వాత, కర్ణాటక ప్రభుత్వం అవినీతి నిరోధక బ్యూరోను రద్దు చేస్తూ, ఏసీబీ నిర్వహిస్తున్న పెండింగ్ కేసులను లోకాయుక్తకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు బీఎస్.యడియూరప్పను చూసి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. బీఎస్.యడియూరప్పను ఉద్దేశించి ఉపయోగించే రాజా హులీ (రాజా పులి)ని చూసి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారనీ, అనవసరంగా ఆయనను టార్గెట్ చేస్తున్నారని సీఎం అన్నారు. "మాజీ సీఎంపై వాళ్లు కొన్ని వ్యాఖ్యలు చేశారు కానీ రాజా హూళి (యడ్యూరప్ప) పట్టించుకోరు. మీరు యడియూరప్పపై రాజ్యమేలాలని ప్రయత్నించి, ఆయనను అధికారానికి దూరంగా ఉంచేందుకు తప్పుడు కేసులు పెట్టారనీ, కానీ ఆయన సింహికలా తిరిగారని..." బసవరాజ్ బొమ్మై అన్నారు.
"కోవిడ్ -19 మహమ్మారి సమయంలో 1.25 బిలియన్ల మందికి టీకాలు వేసినందుకు ప్రపంచం మొత్తం మోడీని ప్రశంసించింది. అనేక దేశాలకు వ్యాక్సిన్‌లను కూడా విరాళంగా ఇచ్చింది. బేటీ బచావో, బేటీ పడావో, ఉజ్వల వంటి అనేక పథకాలు ప్రజల సంక్షేమం కోసం ప్రారంభించబడ్డాయి. రైతులు కిసాన్ సమ్మాన్ పథకం నుండి ప్రయోజనం పొందారు. ప్రపంచం మొత్తం మాంద్యంలో చిక్కుకున్నప్పుడు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రమే బలపడుతోంది. దురదృష్టవశాత్తు, సిద్ధరామయ్య మతిమరుపుతో బాధపడుతున్నారు" అంటూ బొమ్మై పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని విమర్శించే బదులు, కర్నాటకలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాషాయ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని అడగాలని సిద్ధరామయ్య చెప్పిన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. డియూరప్పను సీఎం బొమ్మై ‘షీల్డ్’లా వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. ‘‘సీఎం బసవరాజ్ బొమ్మైకి ఒంటరిగా యాత్ర చేసే ధైర్యం లేదు. ప్రజలు తనపై రాళ్లు విసురుతారని భయపడ్డాడు. అందుకే యడ్యూరప్పను కవచంగా ఉపయోగించుకుంటున్నారు’’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.