కోవిడ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి: కాంగ్రెస్ విమర్శలకు నడ్డా కౌంటర్

Published : Jan 03, 2021, 05:14 PM ISTUpdated : Jan 03, 2021, 05:15 PM IST
కోవిడ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి: కాంగ్రెస్ విమర్శలకు నడ్డా కౌంటర్

సారాంశం

భారత్ ప్రశంసనీయమైన అభివృద్దిని సాధించిన సమయంలో.... ఆ విజయాలను వ్యతిరేకించడానికి ఎగతాళి చేసేందుకు ముందుకు వస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. 

న్యూఢిల్లీ: భారత్ ప్రశంసనీయమైన అభివృద్దిని సాధించిన సమయంలో.... ఆ విజయాలను వ్యతిరేకించడానికి ఎగతాళి చేసేందుకు ముందుకు వస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. 

also read:కరోనాపై వివాదాస్పద వ్యాఖ్యలు: విపక్షాలకు నెటిజన్ల క్లాస్

  కాంగ్రెస్ ఎంతగా ఈ విధానాలను వ్యతిరేకిస్తోందో అంతగా ఎక్స్‌పోజ్ అవుతోందని ఆయన చెప్పారు..కరోనా వైరస్ నిర్మూలన కోసం ఏడాది సమయంలోనే వ్యాక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తలు కృషి చేశారని ఆయన చెప్పారు. ఈ విషయమై దేశం మొత్తం సంతోషంగా ఉంటే కాంగ్రెస్ , కొన్ని విపక్షాలు ఎగతాళి చేయడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు.

 

 

తమ స్వంత విఫలమైన రాజకీయాలు , దుర్మార్గపు ఎజెండాలను మరింతగా పెంచడానికి కాంగ్రెస్ సహా ఇతర విపక్షనాయకులు ప్రజల్లో మనసుల్లో భయాందోళనలు కల్గించే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఇతర సమస్యలపై రాజకీయాలు చేయాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. ప్రజల జీవితాలతో ఆడకూడదని ఆయన కోరారు.


 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?