యూపీలో విషాదం: భవనం కుప్పకూలి 8 మంది మృతి: శిథిలాల కింద పలువురు

Published : Jan 03, 2021, 03:25 PM ISTUpdated : Jan 03, 2021, 03:30 PM IST
యూపీలో విషాదం: భవనం కుప్పకూలి 8 మంది మృతి: శిథిలాల కింద పలువురు

సారాంశం

 ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో ఆదివారం నాడు ఓ భవనం పై కప్పు కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. 

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో ఆదివారం నాడు ఓ భవనం పై కప్పు కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. 

భవనం పై కప్పు కూలడంతో ఎనిమిది మంది మరణించారు. వర్షం కారణంగా భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవాళ ఉదయం నుండి ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగానే భవనం కూలినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు శిథిలాల కింద సుమారు ముగ్గురిని వెలికితీశారు. 

క్షతగాత్రులకు సరైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను కోరారు. అదేవిధంగా సహాయక చర్యలను యుద్దప్రాతిపదికన చేపట్టాలని ఆయన  ఆదేశించారు.వర్షం కారణంగా ఆలస్యంగా సహాయక చర్యలు ప్రారంభమైనట్టుగా స్థానికులు చెబుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?