
ఏఐసీసీ (aicc) అధినేత్రి సోనియా గాంధీపై (sonia gandhi) బీజేపీ నేత ప్రేమ్ శుక్లా (prem shukla) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ (congress) శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ (jairam ramesh) ఆదివారం జేపీ నడ్డాకు లేఖ రాశారు. ప్రేమ్ శుక్లా సోనియా గాంధీని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోని గౌరవప్రదమైన మహిళలపై అభ్యంతరకర బాష వాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ మహిళా వ్యతిరేక ఆలోచనలకు నిదర్శనమని.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల దేశ రాజకీయాల స్థాయి దిగజారుతుందని జైరాం రమేశ్ మండిపడ్డారు.
మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని.. అయితే బీజేపీ నుంచి రాజకీయాలు, మహిళలపై గౌరవ ప్రవర్తనను ఆశించడం సహజమేనని ఆయన చురకలు వేశారు. బీజేపీ నేతలు, అధికార ప్రతినిధులు వాడుతున్న భాష తమను నిరాశకు గురిచేస్తోందని జైరాం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ పట్ల చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత్రి అయినా మరే ఇతర నేతల పట్ల అయినా మరోసారి ఈ తరహా భాష ఉపయోగిస్తే పరువు నష్టం దావా వేస్తామని నడ్డాకు రాసిన లేఖలో జైరాం రమేశ్ హెచ్చరించారు.
ALso REad:నేషనల్ హెరాల్డ్ కేసు: ఈ నెల 25న విచారణకు రావాలని సోనియాకు ఈడీ నోటీసులు
మరోవైపు.. National Herald కేసులో ఈ నెల 25న మరోసారి విచారణకు రావాలని Congress పార్టీ చీఫ్ Sonia Gandhi కి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో Enforcement Directorate అధికారులు సోనియాగాంధీని జూలై 21న ప్రశ్నించారు. సుమారు మూడు డంటలపాటు సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణను ముగించాలని సోనియా గాంధీ కోరలేదని జైరాం రమేష్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సోనియా గాంధీకి ఈడీ అధికారులు ఈ నెల 11న నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకున్న సోనియా గాంధీ విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి గతంలోనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరు కావాలి. కరోనా సోకడం, కరోనా తర్వాత చోటు చేసుకొన్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని సోనియా గాంధీ కోరారు. దీంతో ఈడీ అధికారులు సోనియా గాంధీకి సమయం ఇచ్చారు.