ఆ పాలసీపై కాంగ్రెస్ యూటర్న్? ఖర్గేకు పార్లమెంటు పోస్టు ఇస్తారా?.. కీలక నేతలతో సోనియా భేటీ

By Mahesh KFirst Published Dec 2, 2022, 1:10 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మళ్లీ పార్లమెంటు పోస్టు దక్కనుందా? కాంగ్రెస్ రూపొందించుకున్న వన్ పర్సన్ వన పోస్టు పాలసీపై యూటర్న్ తీసుకోనుందా? సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ స్ట్రాటజీ గ్రూపు సభ్యులతో సమావేశం ఈ చర్చను తీసుకువచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకే మళ్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నేత బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తికి ఒక పోస్టు అనే విధానంపై యూటర్న్ తీసుకోబోతున్నదా? అధ్యక్షుడిగా కొనసాగుతున్న మల్లికార్జున్ ఖర్గేకు పార్లమెంటు పోస్టును మళ్లీ అప్పజెప్పనుందా? కొన్ని విశ్వసనీయవర్గాల ప్రకారం, వీటికి ఔననే సమాధానం లభిస్తున్నది. 

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగడానికి ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధ్యక్షుడిగా గెలుపొందారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఆయనకే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక వేళ మల్లికార్జున్ ఖర్గే రెండు పదవులూ చేపడితే మాత్రం కాంగ్రెస్ తీర్మానించుకున్న వన్ పర్సన్ వన్ పోస్టు నిబంధనపై యూటర్న్ తీసుకున్నట్టే అవుతుంది. అయితే, ఇది కేవలం ఖర్గేకు మాత్రమే మినహాయింపు అనే ముక్తాయింపులూ వస్తాయా? అనేది వేచి చూడాల్సి ఉన్నది.

Also Read: మీరు సానుభూతి కోసం పేదోడినంటారు.. అలాగంటే నేను అంటరానివాడిని.. నా చాయ్ కూడా ఎవరు తాగరు: గుజరాత్‌లో ఖర్గే

ఖర్గేకు పార్లమెంటు పోస్టు ఇచ్చే విషయమై సోనియా గాంధీ ఇప్పటికే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ గ్రూప్ సభ్యులతో సమావేశమైనట్టు తెలిసింది. ఈ సమావేశానికి రాజ్యసభ నుంచి మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌లను మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తున్నది.

మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా రాజీనామా చేసిన తర్వాత దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం ఈ పోస్టు కోసం ఫ్రంట్ రన్నర్‌లుగా ఉన్నారు. కానీ, వారిద్దరినీ ఈ భేటీకి పిలువకపోవడం గమనార్హం.

ఇక్కడ మరో విషయం ప్రస్తావనార్హం. వన్ పర్సన్ వన్ పోస్టు అనే నిబంధనను రాహుల్ గాంధీ నొక్కి పలికిన తరుణంలో అశోక్ గెహ్లాట్‌ను అధ్యక్ష బరిలకి దింపలేదు. అశోక్ గెహ్లాట్ రాజస్తాన్ సీఎం పదవి వదిలిపెట్టుకోవడానికి సిద్ధం కాలేదు. ఆయన సీఎంగానే కొనసాగాలని, ఒక వేళ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్తాన్ సీఎంగా మాత్రం సచిన్ పైలట్‌ను నియమించరాదనే డిమాండ్‌తో గెహ్లాట్ అనునాయ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.

Also Read: శశిథరూరర్‌కు ఓటేసిన 1000 మంది బీజేపీలో చేరుతారన్న అసోం సీఎం.. థరూర్ ఏమన్నారంటే?

ఈ నేపథ్యంలో ఒకరికి ఒక పదవి అనే రూల్‌ను రాహుల్ గాంధీ కేరళలో స్పష్టం చేశారు. దీంతో అశోక్ గెహ్లాట్‌ను బరిలోకి దింపాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ ఉపసంహరించుకుంది. కానీ, ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గేను పార్టీ ‘అఫీషియల్’ క్యాండిడేట్‌గా బరిలోకి దింపింది.

ఒకరికి ఒకే పదవి అనే పాలసీ కింద అశోక్ గెహ్లాట్‌ను బరిలోకి దింపని కాంగ్రెస్ ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు అయినప్పటికీ ఆయన పార్లమెంటు పదవి మళ్లీ ఆయనకే అప్పజెప్పాలని ఆలోచించడం ఆసక్తిగా మారింది. అయితే, అశోక్ గెహ్లాట్‌ను బరిలో నుంచి తప్పించడానికి ఆయన అనునాయ ఎమ్మెల్యేలు చేసిన తిరుగుబాటు కూడా ఒక కారణమై ఉండొచ్చని అప్పుడు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రాజస్తాన్‌లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ మధ్య రగడ ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

click me!