రాయబరేలి: కాంగ్రెస్ మారథాన్‌లో అపశృతి.. చొచ్చుకొచ్చిన విద్యార్ధులు, తొక్కిసలాట

By Siva KodatiFirst Published Jan 4, 2022, 2:25 PM IST
Highlights

యూపీలోని బరేలిలో కాంగ్రెస్ మారథాన్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మారథాన్‌లో తొక్కిసలాట జరగడంతో పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యార్థులు, కార్యకర్తలు ఒక్కసారిగా తోసుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారు. 

యూపీలోని బరేలిలో కాంగ్రెస్ మారథాన్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మారథాన్‌లో తొక్కిసలాట జరగడంతో పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యార్థులు, కార్యకర్తలు ఒక్కసారిగా తోసుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారు. 

మరోవైపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (up assembly elections 2022) సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీపై (congress) యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) మండిపడ్డారు. దేశానికి అతిపెద్ద సమస్య కాంగ్రెస్ (congress) పార్టీనే అంటూ వ్యాఖ్యానించారు. అవినీతి, అరాచకాలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని యోగి విమర్శించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో (raebareli) శనివారం బీజేపీ నిర్వహించిన జన విశ్వాస్ యాత్ర సభలో (jan vishwas yatra) ప్రసంగించిన ఆయన.. రాయ్ బరేలీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. 

Also Read:దేశానికి పెద్ద సమస్య కాంగ్రెస్సే.. సోనియా అడ్డాలో యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

కొన్ని రోజుల్లో రాయ్ బరేలీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని సీఎం జోస్యం పలికారు. రాయ్ బరేలీ లోక్‌సభ స్థానానికి సోనియాగాంధీ (sonia gandhi) ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీపై కూడా యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఏదైనా వాహనంపై ఆ పార్టీకి చెందిన జెండా ఉందంటే... అందులో ఆ పార్టీకి చెందిన ఒక గూండా కూర్చున్నాడంటూ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా.. up assembly elections 2022:  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఎలాగైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని ప్ర‌ధాన పార్టీల‌న్ని ప్రణాళిక‌లు ర‌చిస్తున్నాయి. దీనిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ముమ్మ‌రం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలు తాము అధికారంలోకి వస్తే తీసుకురాబోయేప‌థ‌కాలు, హామీలు గురించి చెబుతూ ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నాయి. 
 

click me!