
రాయ్‌పూర్: కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. గతకొంత కాలంగా Congress పార్టీ నేతల మధ్య బేధాభిప్రాయాలు భగ్గుమంటున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ నేతల మధ్య సయోద్య ఇంకా కుదరనలేదు. ఇంకా రుసరుసలు కొనసాగుతూనే ఉండగా తాజాగా, చత్తీస్‌గడ్‌లో ఏకంగా ఓ స్టేజీపైనే ఒకరిని ఒకరు నెట్టేసుకున్నారు. Chhattisgarhలోనూ Chief Minister బాధ్యతలు మార్చాలని, ప్రస్తుత సీఎం Bhupesh Baghel నుంచి పదవి నుంచి దింపాలని డిమాండ్లు వినిపించాయి. ప్రస్తుత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియోకు సీఎం పదవి కట్టబెట్టాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తున్నది. తాజా రభసకూ ఇదే ప్రధాన అంశంగా ఉన్నది. జష్‌పూర్ జిల్లాలో తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జష్‌పూర్ జిల్లాలో నిర్వహించిన ఓ పార్టీ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ మాట్లాడారు. స్టేజీ మీదకు వెళ్లి ప్రసంగిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియోను ప్రస్తావించారు. వెంటనే ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఇఫ్తికర్ హసన్ స్టేజీపైకి వెళ్లారు. ప్రసంగిస్తున్న పవన్ అగర్వాల్‌ను తోసేశారు. తర్వాత వెంట వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు స్టేజీపైకి పరుగెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తేవడానికి టీఎస్ సింగ్ డియో, సీఎం భుపేశ్ భగేల్‌లు కలిసి విశేష కృషి చేశారు. ఇప్పుడు భుపేశ్ భగేల్ సీఎం పీఠాన్ని వదిలిపెట్టడానికి సమయం ఆసన్నమైందని, ఆ సీటును టీఎస్ సింగ్ డియోకు అప్పజెప్పాలని అన్నారు. ఈ మాటలు మాట్లాడుతుండగానే ఇఫ్తికర్ హసన్ ఆయనను మైక్ వద్ద నుంచి నెట్టేశారు.
Also Read: 40శాతం టికెట్లు మహిళలకే.. ఉన్నావ్ బాధితురాలి కోసం నిర్ణయం.. ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన
టీఎస్ సింగ్ డియో సీఎం పీఠాన్ని అధిరోహించడానికి రెండున్నరేళ్లు వెయిట్ చేశారని జిల్లా మాజీ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ అన్నారు. భుపేశ్ భగేల్ సీఎం సీటును త్యజించాలని చెప్పారు. కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి రావడానికి వీరిద్దరూ కలిసి పని చేశారని వివరించారు. వారిద్దరి కృషి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ముందుగా అనుకున్నట్టుగా రెండున్నరేళ్లు ముగిసిన తర్వాత సీఎం పీఠాన్ని భుపేశ్ భగేల్.. టీఎస్ సింగ్ డియోకు ఇవ్వాలని సూచించారు. ఇదే విషయాన్ని చెబుతుండగా తనపై దాడి చేశారని వివరించారు.
రాష్ట్రంలో సీఎంను మార్చాలని టీఎస్ సింగ్ ఇటీవలే పలుసార్లు డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, భుపేశ్ భగేల్ రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని, తర్వాత ఆయనను మార్చాల్సిందేనని పేర్కొన్నారు. ఈ డిమాండ్లు రాగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో వీరిద్దరితో ప్రత్యేక సమావేశాలు జరిపారు. తర్వాత ఈ డిమాండ్ల సద్దుమణిగినా, తాజాగా మరోసారి తెరమీదకు వచ్చింది.