పరువు నష్టం కేసు .. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

Siva Kodati |  
Published : Jul 15, 2023, 05:01 PM ISTUpdated : Jul 15, 2023, 05:06 PM IST
పరువు నష్టం కేసు .. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

సారాంశం

పరువు నష్టం కేసులో తనపై కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్ట్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.  

పరువు నష్టం కేసులో తనపై కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్ట్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.  మోడీ ఇంటి పేరు గురించి చేసిన వ్యాఖ్యలకు గాను గాంధీని దోషిగా నిర్ధారిస్తూ, రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్ట్. దీంతో రాహుల్ గాంధీపై లోక్‌సభ స్పీకర్ అనర్హత వేటు వేశారు. అయితే కోర్ట్ తీర్పుపై స్టే విధించడం వల్ల రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యుడిగా తిరిగి నియమించబడటానికి మార్గం సుగమం అవుతుంది. కానీ సెషన్స్ కోర్ట్ నుంచి గానీ, గుజరాత్ హైకోర్ట్ నుంచి గానీ ఆయనకు ఎలాంటి ఊరట లభించలేదు. 

మరోవైపు.. రాహుల్ గాంధీ కొత్త ఇంటిలో అడుగుపెట్టనున్నారు. సౌత్ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ బీ 2 ప్రాంతంలోని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌కు ఆయన వెళతారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలో ఈ ఇంట్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత షీలా దీక్షిత్ నివసించారు. ఇప్పుడు ఇక్కడికే యువనేత మకాం మారుస్తారని సమాచారం. పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై లోక్‌సభ స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో నిబంధనల మేరకు రాహుల్ గాంధీ ప్రభుత్వ బంగ్లాలో వుండటానికి అనర్హుడు.

Also Read: రాహుల్ గాంధీకి చుక్కెదురు: పరువు నష్టం కేసులో సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టేకి నిరాకరణ

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 22న రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు తమ ఇళ్లు ఇస్తామంటూ రాహుల్ గాంధీకి చెప్పారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం తన తల్లి సోనియా నివాసంలో వుంటున్నారు. అలాగే మరో ఇంటి కోసం ఆయన ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే షీలా దీక్షిత్ మాజీ నివాసానికి రాహుల్ వెళ్తారని తెలుస్తోంది. ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌లో 1991 నుంచి 1998 వరకు షీలా దీక్షిత్ నివసించారు. సీఎంగా, గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆమె ప్రభుత్వ అధికారిక నివాసాల్లో వున్నారు. అయితే 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడంతో .. షీలా దీక్షిత్ ఈ ఫ్లాట్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. చివరి శ్వాస వరకు ఆమె ఇక్కడే గడిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Independence Day 2026 : ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా.. యువత గురించి ప్రధాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
80వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech