కొత్త ఇల్లు వెతికిన రాహుల్ గాంధీ.. త్వరలోనే షిఫ్టింగ్ , ఆ ఇంటితో షీలా దీక్షిత్‌కు లింక్..?

Siva Kodati |  
Published : Jul 12, 2023, 02:28 PM IST
కొత్త ఇల్లు వెతికిన రాహుల్ గాంధీ.. త్వరలోనే షిఫ్టింగ్ , ఆ ఇంటితో షీలా దీక్షిత్‌కు లింక్..?

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సౌత్ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ బీ 2 ప్రాంతంలోని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌కు ఆయన వెళతారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌లో 1991 నుంచి 1998 వరకు షీలా దీక్షిత్ నివసించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త ఇంటిలో అడుగుపెట్టనున్నారు. సౌత్ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ బీ 2 ప్రాంతంలోని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌కు ఆయన వెళతారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలో ఈ ఇంట్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత షీలా దీక్షిత్ నివసించారు. ఇప్పుడు ఇక్కడికే యువనేత మకాం మారుస్తారని సమాచారం. పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై లోక్‌సభ స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో నిబంధనల మేరకు రాహుల్ గాంధీ ప్రభుత్వ బంగ్లాలో వుండటానికి అనర్హుడు. 

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 22న రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు తమ ఇళ్లు ఇస్తామంటూ రాహుల్ గాంధీకి చెప్పారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం తన తల్లి సోనియా నివాసంలో వుంటున్నారు. అలాగే మరో ఇంటి కోసం ఆయన ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే షీలా దీక్షిత్ మాజీ నివాసానికి రాహుల్ వెళ్తారని తెలుస్తోంది. ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌లో 1991 నుంచి 1998 వరకు షీలా దీక్షిత్ నివసించారు. సీఎంగా, గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆమె ప్రభుత్వ అధికారిక నివాసాల్లో వున్నారు. అయితే 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడంతో .. షీలా దీక్షిత్ ఈ ఫ్లాట్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. చివరి శ్వాస వరకు ఆమె ఇక్కడే గడిపారు. 

కాగా.. పరువు నష్టం కేసులో మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించారు. దోషిగా తేలడంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు. సభ్యత్వానికి అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌లో మాట్లాడుతూ తన గొంతును అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే తాను భయపడబోనని అన్నారు. 

ALso Read: రాహుల్ గాంధీకి చుక్కెదురు: పరువు నష్టం కేసులో సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టేకి నిరాకరణ

ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్షపై నిర్ణయాన్ని నిలిపివేస్తే.. ఆయనపై ఉన్న అనర్హత కేసును కూడా కొట్టివేయవచ్చు. ప్రస్తుతం రాహుల్ గాంధీపై 2+6 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యునిగా సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. తన శిక్షా నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. తన శిక్షపై స్టే విధించాలంటూ దరఖాస్తు కూడా దాఖలు చేశాడు. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది.  అయితే తన నేరాన్ని నిలుపుదల చేయాలంటూ ఆయన చేసిన దరఖాస్తు ఏప్రిల్ 20న తిరస్కరించబడింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?