శాంతించని రాహల్ గాంధీ: సోనియాగాంధీ సమావేశానికి గైర్హాజరు

By Nagaraju penumalaFirst Published Sep 13, 2019, 4:32 PM IST
Highlights

కాంగ్రెస్ నేతలంతా ప్రజలకు చేరువకావాలని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియా పోస్టులకు స్వస్తి పలికి ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించాలని సోనియా దిశానిర్దేశం చేశారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంకా శాంతించినట్లు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాహుల్ గాంధీ. 

శుక్రవారం ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన అత్యున్నత సమావేశానికి రాహుల్ గాంధీ గైర్హాజరవ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో సోనియాగాంధీ సమావేశం అయ్యారు.

దేశ ఆర్థిక సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, వందరోజుల పాలన, జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు వంటి అంశాలపై నేతలతో సోనియగాంధీ చర్చించారు. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు, పీసీసీ చీఫ్ లు హాజరైనా రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంపై పార్టీ నేతలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.  

 సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంపై సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజలకు చేరువకావాలని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియా పోస్టులకు స్వస్తి పలికి ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించాలని సోనియా దిశానిర్దేశం చేశారు.

జాతిపిత మహాత్మాగాంధీ, సర్థార్‌ వల్లబాయ్‌పటేల్‌, నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని ఈ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సోనియాగాంధీ పిలుపునిచ్చారు. 
 

click me!