రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గేకి కరోనా: హోం ఐసోలేషన్ లో చికిత్స

By narsimha lodeFirst Published Jan 13, 2022, 11:53 AM IST
Highlights

రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గేకి కరోనా సోకింది. ఆయన హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకొంటున్నారు.


బెంగుళూరు. రాజ్యసభలో విపక్షనేత Mallikarjun Kharge కి కరోనా సోకింది.  గత వారంలో Mekedatu మంచినీటి పథకాన్ని ప్రారంభించాలని  కోరుతూ గత వారంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభించింది. కర్ణాటక పీసీసీ చీఫ్ Dk shivakumar ఈ పాదయాత్రకు నాయకత్వం వహించారు. ఆ యాత్రను కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గేలు ప్రారంభించారు. మల్లికార్జున ఖర్గేకు corona లక్షణాలు కన్పించలేదని వైద్యులు చెప్పారు. doctor సూచన మేరకు ఖర్గే హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నాడు. 

బుధవారం నాడు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మల్లికార్జున ఖర్గేకి కరోనా నిర్ధారణ అయిందని ఖర్గే సెక్రటరీ రవీంద్ర గరిమెళ్ల తెలిపారు. ఖర్గే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నాడని రవీంద్ర వివరించారు. కానీ బూస్టర్ డోస్ కి ఇంకా అర్హత పొందలేదన్నారు.  ఖర్గేకి చెందిన ఢిల్లీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. వారికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఈ ఐడుగురు సభ్యులు కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నారని రవీంద్ర తెలిపారు.

అర్హత ఉన్న వారంతా కరోనా బూస్టర్ డోస్ వేసుకోవాలని కూడా ఖర్గే కోరారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ ను వేసుకోవాలన్నారు. బూస్టర్ డోస్ వేసుకోవడానికి అంతరాన్ని తగ్గించాలని కూడా ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ప్రకటనలో మల్లికార్జున ఖర్గే కోరారు. .మరో వైపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ బుధవారం నాడు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హొం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నాడు.

మల్లికార్జున ఖర్గే మాజీ కేంద్ర మంత్రి. కార్మిక, ఉపాధి కల్పన మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2009 నుండి 2019 వరకు ఆయన గుల్బర్గా నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహించాడు. గత ఎన్నికల సమయంలో ఆయన ఎంపీగా ఓటమి పాలయ్యాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది. గులాం నబీ ఆజాద్ కు Rajyasabhaనుండి రిటైర్ కావడంతో ఖర్గేను రాజ్యసభకు పంపింది Congress పార్టీ.  కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. Karnataka శాసనసభలో కూడా ఆయన విపక్ష నాయకుడిగా గతంలో పనిచేశారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక పీసీసీ చీప్ గా ఖర్గే పనిచేశారు.

కర్ణాటక రాష్ట్రంలో మేకేదాటు నీటి పథకాన్ని అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర సాగుతుంది. డికె శివకుమార్ సహా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి పూట కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది.ఈ తరుణంలో ఈ పాదయాత్ర రాష్ట్రంలో కరోనాను వ్యాప్తి చేసేందుకు దోహదం చేసే అవకాశం ఉందనే బీజేపీ ఆరోపిస్తోంది.  మరో వైపు పాదయాత్ర సందర్భంగా విశ్రాంతి తీసుకొంటున్న డీకే శివకుమార్ వద్దకు వెళ్లిన వైద్య సిబ్బందిని ఆయన వెనక్కి పంపారు. కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు కూడా శివకుమార్ నిరాకరించారు.

10 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 19న పాదయాత్ర బెంగుళూరులో ముగియనుంది. ఈ నెల 9న కనకపురలో పాదయాత్ర ప్రారంభమైంది. మాజీ సీఎం సిద్దరామయ్య, రాజ్యసభలో విపక్షనేత  సిద్దరామయ్యలు ఈ ర్యాలీని ప్రారంభించారు. మరో వైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేసినట్టుగా కర్ణాటక సీఎం బొమ్మై తెలిపారు

click me!