ఢిల్లీ : ఉత్తరాఖండ్ ప్రతిపక్షనేత నేత ఇందిరా హ్రిదయేశ్ కన్నుమూత

Siva Kodati |  
Published : Jun 13, 2021, 03:36 PM IST
ఢిల్లీ : ఉత్తరాఖండ్ ప్రతిపక్షనేత నేత ఇందిరా హ్రిదయేశ్ కన్నుమూత

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత ఇందిరా హ్రిదయేష్ కన్నుమూశారు. ఆదివారం ఢిల్లీలోని ఉత్తరాఖండ్ సదన్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఇందిర కన్నుమూసినట్టు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దేవేందర్ యాదవ్ తెలిపారు

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత ఇందిరా హ్రిదయేష్ కన్నుమూశారు. ఆదివారం ఢిల్లీలోని ఉత్తరాఖండ్ సదన్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఇందిర కన్నుమూసినట్టు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దేవేందర్ యాదవ్ తెలిపారు. ఢిల్లీలో ఒక సమావేశం కోసం ఆమె వచ్చారని, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని చెప్పారు. 1941 ఏప్రిల్ 7న జన్మించిన హ్రిదయేష్ 2012లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హల్ద్వాని నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2012 నుంచి 2017 వరకూ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. హరీష్ రావత్ నేతృత్వంలో హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇందిర మృతిపై ప్రధాని నరేంద్రమోడీ సహా కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు సంతాపం తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..