భార్యను గొంతుకోసి చంపి, కాల్చేసిన ఎస్సై, హెల్ప్ చేసిన కాంగ్రెస్ లీడర్.. అరెస్ట్.. !

By AN TeluguFirst Published Jul 26, 2021, 10:08 AM IST
Highlights

ఆమెను చంపి బాడీని అసోసియేట్ సాయంతో తగల బెట్టారని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాండ్ అధికారులు తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న కిరీట్జింగ్ జడేజా అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. అతను కర్ణన్ నుంచి 2020 లో అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయాడు. 

అహ్మదాబాద్ : గుజరాత్ లో దారుణం జరిగింది. అసోసియేట్ సాయంతో భార్యను దారుణంగా హత్య చేసిన పోలీస్ ఇన్ స్పెక్టర్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని వడోదర జిల్ల, కర్జన్ ప్రాంతంలో నెలన్నరక్రితం ఆమె అదృశ్యం అయ్యింది. 

ఆమెను చంపి బాడీని అసోసియేట్ సాయంతో తగల బెట్టారని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాండ్ అధికారులు తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న కిరీట్జింగ్ జడేజా అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. అతను కర్ణన్ నుంచి 2020 లో అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయాడు. 

"జూన్ 4,5 మధ్య కాలంలో వడోదర రూరల్ పోలీస్ స్టేషన్ కు చెంది అజయ్ దేశాయ్ అనే ఇన్ స్పెక్టర్ తన భార్య స్వీటీని చంపినందుకు అరెస్ట్ చేశాం. అతను భార్య మృతదేహాన్ని జడేజాకు చెందిన నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ లో కాల్చేశారు. ఇది భరూచ్ జిల్లాలోని దహేజ్ హైవేలోని అటాలి గ్రామంలో ఉంది. కర్జన్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో దేశాయ్, జడేజాపై హత్య, సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపబడ్డాయి"అని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ డిబి బరాద్ తెలిపారు.

ఈ కేసును వారం క్రితం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం సహాయపడింది. జూన్ 4, 5 తేదీలలో రాత్రి భార్యతో గొడవ తరువాత ఆమెను దేశాయి గొంతు కోసి చంపినట్లు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది.

ఆ తరువాత "దేశాయ్, జూన్ 5 ఉదయం, మృతదేహాన్ని ఒక దుప్పటిలో కప్పి, తన ఫోర్ వీలర్ లో అక్కడ్నుంచి తరలించాడు. తరువాత  ఉదయం 11:30 గంటల సమయంలో, ఆమె తమ్ముడికి కాల్ చేసి రాత్రి గొడవ తరువాత కనిపించకుండా పోయిందని తెలిపాడు. ఆ తరువాతే దేశాయ్ జడేజా సాయంతో మృతదేహాన్ని దహేజ్ హైవేపై అటాలి గ్రామంలో నిర్మాణంలో ఉన్న హోటల్ బ్యాక్ యార్డ్ లో దహనం చేశాడు."అని విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

click me!