హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు.. కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం..!

Published : Dec 10, 2022, 05:20 PM ISTUpdated : Dec 10, 2022, 05:21 PM IST
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు.. కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం..!

సారాంశం

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సీఎం రేసులో ఉండటంతో.. సీఎం ఎంపిక బాధ్యతను అక్కడ పార్టీ విజయంలో కీలక భూమిక పోషించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించినట్టుగా ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం జరుగుతన్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ సమావేశంలో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఆదివారం రోజున ప్రమాణ స్వీకరాం  చేస్తారని కూడా కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 

అయితే హైకమాండ్ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. ‘‘హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు ఇంకా తెలియదు. సాయంత్రం 5 గంటలకు జరిగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశానికి నేను వెళ్తున్నాను’’ అని ఆయన చెప్పారు. 

ఇక, సుఖ్వీందర్ సింగ్ సుఖు.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాపెయినింగ్ కమిటీకి హెడ్‌గా వ్యహరించారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. అయితే వీరభద్ర సింగ్‌ కుటుంబానికి సుఖ్వీందర్ సింగ్ సుఖు‌లకు మధ్య సఖ్యత లేదనే ప్రచారం ఉంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?