60 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ రేట్లు తెలుసా.. ధరలు పెంచి తగ్గించారు.. లెక్కలతో కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు

Published : May 22, 2022, 12:48 PM ISTUpdated : May 22, 2022, 12:58 PM IST
60 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ రేట్లు తెలుసా.. ధరలు పెంచి తగ్గించారు.. లెక్కలతో కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు

సారాంశం

కేంద్ర ప్రభుత్వం చమురు ధరల తగ్గింపుపై శనివారం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా బీజేపీయేతర రాష్ట్రాలు కూడా చమురు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొందరు కేంద్ర మంత్రులు వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లకు కాంగ్రెస్ వెంటనే స్పందించి లెక్కలు చేసింది. కేంద్రంపై విమర్శలు చేస్తూ ప్రజలను పిచ్చోళ్లు చేయొద్దని, 60 రోజుల క్రితం ఉన్న ధరల కంటే కూడా తాజా తగ్గింపుతో ధరలు ఎక్కువగానే ఉంటాయని పేర్కొన్నారు.  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిన్న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ. 8, డీజిల్ పై రూ. 6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేట్లు తగ్గించాలని ట్వీట్లు చేశారు. దీంతో కాంగ్రెస్ వెంటనే స్పందిస్తూ లెక్కలు చేసింది. ప్రజలను పిచ్చోళ్లు చేయొద్దని కేంద్రంపై విమర్శలు సంధించింది.

కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పురి బీజేపీయేతర రాష్ట్రాలపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు పెద్ద మొత్తంలో ధరలు తగ్గించినా.. బీజేపీయేతర రాష్ట్రాలు అదే విధంగా తగ్గింపునకు సహకరించడం లేవని ఆరోపించారు. ఇప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే.. ఆ రాష్ట్రాల్లో చమురు ధరలు రూ. 10 నుంచి రూ. 15 వరకు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లకు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా స్పందించారు.

ఆయన మూడు ట్వీట్లను కేంద్ర ఆర్థిక మంత్రిని ఉద్దేశిస్తూ చేశారు. అందులో ఒక ట్వీట్‌లో ఎక్సైజ్ డ్యూటీ, మరో రెండు ట్వీట్లలో పెట్రోల్, డీజిల్ రేట్లను పోల్చారు.

ఎక్సైజ్ డ్యూటీ గురించి చర్చిస్తూ .. ఆయన మే 2014 వివరాలను ప్రస్తావించారు. 2014 మేలో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ. 9.48గా ఉన్నదని ఇప్పుడు.. 2022 మే 21న లీటర్ పెట్రలో‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ. 27.90గా ఉన్నదని వివరించారు. ఇప్పుడు రూ. 8 తగ్గించారని, అంటే.. లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 18.42 పెంచి.. అందులో నుంచి రూ. 8 తగ్గించారని తెలిపారు. అంటే.. కాంగ్రెస్ హయాంలో ఎక్సైజ్ డ్యూటీ రూ. 9.48 ఉండగా.. ఇప్పుడు తాజా తగ్గింపుతో ఎక్సైజ్ డ్యూటీ రూ. 19.90 ఉన్నదని వివరించారు.

అదే విధంగా డీజిల్, పెట్రోల్ రేట్ల గురించి చర్చించారు. నేడు డీజిల్ ధర రూ. 96.67 ఉందని, అందులో తాజా రూ. 7 తగ్గిస్తున్నారని రణదీప్ సింగ్ సుర్జేవాలా తెలిపారు. అదే లీటర్ డీజిల్ ధర 60 రోజుల క్రితం అంటే 2022 మార్చి 21న రూ. 86.67గా ఉన్నదని పేర్కొన్నారు. అంటే 60 రోజుల్లో డీజిల్ ధర రూ. 10 పెంచారని, అందులో ఇప్పుడు రూ.7 తగ్గిస్తున్నారని వివరించారు.

పెట్రోల్ ధరనూ రెండు నెలల క్రితం వివరాలతో పోల్చారు. నేడు పెట్రోల్ ధర రూ. 105.41 ఉన్నదని, అందులో ఇప్పుడు రూ. 9.50 తగ్గిస్తున్నామని చెబుతున్నారని తెలిపారు. అదే రెండు నెలల క్రితం 2022 మార్చి 21న లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41గా ఉన్నదని పేర్కొన్నారు. అంటే 60 రోజుల్లో పెట్రోల్ ధర రూ. 10 మేరకు పెంచి ఇప్పుడు 9.50 తగ్గిస్తున్నారని వివరించారు. అందుకే ప్రజలను పిచ్చోళ్లను చేయొద్దని తెలిపారు. అయితే, ఈ ట్వీట్లు ఆయన ఈ నెల 21న అంటే.. కేంద్రం ప్రకటన తర్వాత చేశారు. అయితే, ఆయన బహుశా ఢిల్లీలోని చమురు ధరలను ఆధారంగా తీసుకుని ఉంటారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు