భారత్ బంద్‌కు కాంగ్రెస్ మద్ధతు

By Siva KodatiFirst Published Dec 6, 2020, 4:22 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఈనెల 8న పిలుపునిచ్చిన 'భారత్ బంద్‌'కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఆదివారం మీడియాకు పార్టీ నిర్ణయం తెలిపారు

కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఈనెల 8న పిలుపునిచ్చిన 'భారత్ బంద్‌'కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఆదివారం మీడియాకు పార్టీ నిర్ణయం తెలిపారు.

రైతు బంద్‌కు మద్దతుగా తాము పార్టీ కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రైతులకు బాసటగా నిలుస్తున్న రాహుల్‌ గాంధీకి మరింత బలం చేకూర్చేలా కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని పవన్ వెల్లడించారు. 

వ్యవసాయ బిల్లులను కేంద్రం హడావిడిగా పార్లమెంటులో ఆమోదించడం వెనుక ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని పవన్ ఖేరా చెప్పారు. రైతుల ఆందోళనలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం తమ గోడు వింటుందేమోనన్న ఆశతో పది రోజులుగా చలిగాలుల్లో, అర్ధరాత్రులు రోడ్లపై రైతులు పడుతున్న అవస్థలు అంతా గమనిస్తున్నారని పవన్ వెల్లడించారు. రైతులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అడగాల్సిన ప్రాథమిక బాధ్యత మనకుందన్నారు. 

కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో హడావిడిగా ఆర్డినెన్స్‌లు, బిల్లులు ఎందుకు తేవాల్సి వచ్చిందని పవన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. విపక్ష పార్టీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారని, ఏమాత్రం పార్లమెంటరీ విధివిధానాలను పాటించలేదని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం, కార్పొరేట్ మిత్రుల మధ్య సాగిన కుట్ర ఫలితమే ఇవాళ ఈ పరిస్థితి అని పవన్ ఖేరా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రీడలో రైతులు బాధితులయ్యారని చెప్పారు. 

కాగా శనివారం రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన ఐదో దఫా చర్చలు కూడా విఫలమైన సంగతి తెలిసిందే. ముగ్గురు కేంద్ర మంత్రులతో దాదాపు 4 గంటల పాటు జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో డిసెంబర్ 9న మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.

click me!