
ఆర్బీఐ రూ.2,000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవడంపై విపక్ష నేతల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు. ఆర్‌బిఐ ప్రకటనతో విచిత్రమైన సంబంధాన్ని ఏర్పచడంతో పాటు.. ప్రధాని మోదీ జపాన్‌కు వెళ్లినప్పుడల్లా ‘నోట్ బందీ’ నోటిఫికేషన్ వస్తుందని ఖర్గే అన్నారు. రూ.500, రూ.1,000 నోట్లను రాత్రికి రాత్రే జరిగిందని 2016 డీమోనిటైజేషన్‌ను ఆయన ప్రస్తావించారు.
గత సారి జపాన్‌కు వెళ్లినప్పుడు రూ.1,000 నోటు రద్దు జరిగిందనీ, ఈసారి జపాన్ వెళ్లినప్పుడు రూ.2,000 నోటు రద్దు చేశారని ఖర్గే ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం (మే 19) హిరోషిమా చేరుకున్నారు . ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మూడు దేశాలను దర్శించనున్నారు. జపాన్ అనంతరం పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాకు వెళ్లున్నారు.
అంతకుముందు.. ఖర్గే ఈ చర్యను "సెంకడ్ డీమోనిటైజేషన్" అని అభివర్ణించారు. ఇది తప్పుడు నిర్ణయానికి తెరలేపుతుందా? లేదా?..అనేది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెల్లడవుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. మొత్తం అసంఘటిత రంగాన్ని సర్వనాశనం చేసిన మొదటి పెద్ద నోట్ల రద్దుతో మీరు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర గాయం చేశారు. MSMEలను (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు) నిలిపివేశారు. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఖర్గే ట్వీట్ చేశారు.
కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం అనంతరం సభను ఉద్దేశించి ఖర్గే ప్రసంగిస్తూ.. దేశానికి మేలు చేస్తుందో, నష్టమో ఆయనకు (పీఎం) తెలియదని, మోదీ చేసిన ‘నోటు రద్దు’ ఈసారి కూడా చేయడం ,ప్రజలను ఇబ్బంది పెట్టబడమేనని అన్నారు. కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘ప్రేమ ప్రభుత్వం’గా పేర్కొంటూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఐదు వాగ్దానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని ఆర్బీఐ శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరు 30 వరకు ఈ నోట్లను డిపాజిట్ చేయడానికి , మార్చుకోవడానికి సదుపాయం కల్పించాలని ఆర్‌బిఐ బ్యాంకులను కోరింది. అయితే, ఒకేసారి రూ.20,000 విలువైన నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. మొదటిసారిగా, 8 నవంబర్ 2016న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దును ప్రకటించారు.
నోట్ల రద్దుతో 500, 1000 రూపాయల నోట్లను మూసివేసి వాటి స్థానంలో కొత్త 500, 2000 రూపాయల నోట్లను విడుదల చేశారు. 2000 రూపాయల నోటును మార్చుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్బీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నోట్లను మే 23 నుంచి మార్చుకోవచ్చు. 2000 రూపాయల నోట్లను ఒకేసారి 20 వేల రూపాయల పరిమితి వరకు మార్చుకోవచ్చు.