పంజాబ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం... 24 గంటల్లో మూడు డ్రోన్లను నేలకూల్చిన బీఎస్ఎఫ్

By Rajesh KarampooriFirst Published May 21, 2023, 2:20 AM IST
Highlights

పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 24 గంటల వ్యవధిలో నాలుగు వేర్వేరు సంఘటనలలో  నాలుగు పాకిస్తాన్ డ్రోన్‌లను సరిహద్దు భద్రతా దళం (BSF)  అడ్డగించి వాటిలో మూడింటిని కాల్చివేసినట్లు ఫోర్స్ ప్రతినిధి శనివారం తెలిపారు. 

పంజాబ్‌లోని (Punjab) అంతర్జాతీయ సరిహద్దు (International border) వెంబడి డ్రోన్ల కలకలం చేలారేగింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నాలుగు పాకిస్తాన్ డ్రోన్‌లను అడ్డగించి వాటిలో మూడింటిని భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్‌సర్‌ (Amritsar) జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన మూడు డ్రోన్లు (Pakistani drones) భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. అయితే గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ (BSF) జవాన్లు వెంటనే అప్రమత్తమై.. వాటిపై కాల్పులు జరిపి నేలకూల్చారు.

మరో డ్రోన్ ను శనివారం రాత్రి కూల్చివేశారు. వాటిలో ఒకదాంట్లో అనుమానాస్పద మత్తుపదార్థాలు ఉన్న బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. మరో డ్రోన్  "DJI మ్యాట్రిస్ 300 RTK" పేరుతో ఉన్న బ్లాక్ క్వాడ్‌కాప్టర్ ఉంది. దీనిని అమృత్‌సర్ జిల్లాలోని ఉదర్ ధరివాల్ గ్రామంలో భద్రతా బలగాలు కూల్చివేశాయి. డ్రోన్ ను కూల్చివేసి, స్వాధీనం చేసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో BSF సిబ్బంది మానవరహిత వైమానిక వాహనాన్ని (UAV) కాల్పులు జరిపి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. మరో డ్రోన్‌కు రతన్‌ ఖుర్ద్‌ గ్రామంలో స్వాధీనం చేసుకున్నామని, దానికి 2.6 కిలోల రెండు హెరాయిన్‌ ప్యాకెట్లను గుర్తించామని తెలిపారు.

శుక్రవారం రాత్రి ఈ ఫ్రంట్‌లో మూడో డ్రోన్‌ని అడ్డుకున్నారు. అయితే అది పాక్‌వైపు తిరిగి వెళ్లిపోయింది.  పాకిస్తాన్ వైపు నుండి కొంతమంద మూడవ డ్రోన్‌ను ఎత్తినట్లు సిసిటివి ఫుటేజీలో కనిపించిందని ప్రతినిధి చెప్పారు. నాల్గవ డ్రోన్ "శనివారం రాత్రి భారత గగనతలాన్ని ఉల్లంఘించింది . అమృత్‌సర్ సెక్టార్ అధికార పరిధిలో కాల్పులు జరపడం ద్వారా అడ్డగించబడింది. డ్రోన్, అనుమానిత మాదక ద్రవ్యాల బ్యాగ్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.

click me!