కరోనా తల్లిదండ్రులను కబళించింది.. ఆ చిన్నారులను ఆదుకోండి: మోడీకి సోనియా లేఖ

Siva Kodati |  
Published : May 21, 2021, 01:58 AM IST
కరోనా తల్లిదండ్రులను కబళించింది.. ఆ చిన్నారులను ఆదుకోండి: మోడీకి సోనియా లేఖ

సారాంశం

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని ప్రధాని నరేంద్రమోడీని కోరారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ మేరకు గురువారం మోడీ లేఖ రాసిన సోనియా.. పిల్లల భవిష్యత్తుకు భరోసా విజ్ఞప్తి చేశారు.

ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని ఉజ్వల్ భవిష్యత్ అందించాలని ఆ లేఖలో కోరారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను, కుటుంబంలో సంపాదించే వ్యక్తులను కోల్పోయిన చిన్నారులకు నవోదయ విద్యాలయాల్లో ఉచిత విద్య అందించాలని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.

వారికి సంభవించిన అనూహ్యమైన విషాదం తర్వాత చిన్నారులకు గొప్ప భవిష్యత్తు కోసం ఆశలు కల్పించాల్సిన అవసరం ఓ దేశంగా మనకు ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినట్టు వార్తలు వస్తున్న విషయాన్ని సోనియా గాంధీ లేఖలో ప్రస్తావించారు.

Also Read:కరోనా బారిన పడిన పిల్లల డేటా సేకరించండి: జిల్లాల అధికారులతో మోడీ

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేసిందీ ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నాణ్యమైన విద్య అందించడం రాజీవ్ లక్ష్యంగా ఉండేదని సోనియా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 661 ఉన్నాయని కాంగ్రెస్ అధినేత్రి పేర్కొన్నారు. కాగా, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది చిన్నారులు సంపాదించే ఇంటి పెద్దనో, తల్లిదండ్రులనో కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu