ప్రజాస్వామ్యంలో అలా చేస్తే.. అది నియంతృత్వమే..: ప్రధాని మోదీపై ఖర్గే ఆగ్రహం .   

Published : Jan 09, 2023, 01:02 AM IST
ప్రజాస్వామ్యంలో అలా చేస్తే.. అది నియంతృత్వమే..: ప్రధాని మోదీపై ఖర్గే ఆగ్రహం .   

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ప్రతిదానికీ మోడీ-మోడీ... ప్రజాస్వామ్యంలో ఒకరిని దేవుడిగా చేస్తే అది ప్రజాస్వామ్యం కాదనీ, అది నిరంకుశత్వంగా మారుతుందని అన్నారు. ఈ చర్యలు నియంతృత్వానికి దారితీస్తాయని ఖర్గే అన్నారు.

ప్రజాస్వామ్యంలో వ్యక్తిని దేవుడని అభివర్ణిస్తే.. అది ప్రజాస్వామ్యం కాదనీ, అది నియంతృత్వం అవుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. రాజ్యాంగం ,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాలు ఏకం కావాలని ఖర్గే పిలుపునిచ్చారు. గుజరాత్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని తన గుజరాతీ గుర్తింపును ఉటంకిస్తూ.. ఓట్లు అడిగారనీ,  తాను కూడా తన పార్టీని, నాయకులను ఆదరించాలని ప్రజలను కోరారు.

ప్రజాస్వామ్యంలో ఒకరిని దేవుడిగా అభివర్ణిస్తే..  అది ప్రజాస్వామ్యం కాదనీ., అది నిరంకుశత్వంగా మిగిలిపోతుందని అన్నారు. ఇలాంటి చర్యలు నియంతృత్వానికి దారితీస్తాయని ఖర్గే అన్నారు. అలాంటి విషయాల గురించి.. ఆలోచించే బదులు .తమ హక్కుల గురించి తెలుసుకోవాలనీ, వాటిని పొందడానికి మీరు పోరాడాలని పిలునిచ్చారు.  ఏప్రిల్-మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక కాంగ్రెస్ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ వర్గాల 'ఏకితా సమసవ్' మెగా కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు.

ప్రధాని మోదీపై దాడి

ఐక్యంగా ఉంటేనే ప్రతిఫలం దక్కుతుందని ఖర్గే అన్నారు. ఐక్యత లోపిస్తే..  బ్రిటీష్ వారు ఉపయోగించిన విభజించి పాలించు సూత్రాన్ని.. తాజాగా ప్రధాని మోడీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.  దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఉంటే ఎవరైనా రిజర్వేషన్లు, పదోన్నతులు అడగవచ్చు, ఎమ్మెల్యే లేదా మంత్రి కావచ్చునని ఖర్గే అన్నారు.

మున్ముందు మార్గం అంత సులువు కాదు.. ఖర్గే బాటలోనూ ముళ్లు  

తనకు హనీమూన్ పీరియడ్ లేదని కాంగ్రెస్‌లోని నేతలకు తెలుసు. ఈ బాధ్యతతో పాటు అన్ని బాధ్యతలు, సవాళ్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండగా, మరో రెండేళ్లలో దేశంలోని 18 రాష్ట్రాలు – హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ , జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, హర్యానా , మహారాష్ట్రలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో చాలా వరకు కాంగ్రెస్ రాజకీయాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ రాష్ట్రాలన్నింటిలో తనను తాను నిరూపించుకోవడం ఖర్గేకు సవాలుగా మారనుంది. రానున్న ఎన్నికల్లో  అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

హిమాచల్, గుజరాత్‌లలో బీజేపీతో కలిసి కాంగ్రెస్ పోటీ పడుతుండగా, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు సవాల్‌ విసురుతోంది. గుజరాత్‌లో ఆప్‌ కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరితే .. ఆ పార్టీ ముందుకు వెళ్లడం కష్టం. అదే విధంగా కర్ణాటకలో ఖర్గేకి అసలు పరీక్ష ఏంటంటే.. మాజీ సీఎం సిద్ధరామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌లను కలిసి పార్టీ కోసం కలిసి పనిచేసేలా ఒప్పించగలరా లేదా? అతిపెద్ద సవాల్ .

వచ్చే ఏడాది జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని, మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రావాలనే ఒత్తిడి కూడా ఆయనపై ఉంటుంది. అయితే తాజా మార్పుల తర్వాత గాంధీ కుటుంబీకుల పాత్ర కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ సంస్థలో ముల్లును సరిచేయడానికి, కార్యకర్తలతో సంప్రదింపులు జరపడం ద్వారా బలోపేతం చేయడానికి , భారత్ జోడో యాత్ర వంటి కార్యక్రమాలు ఎంతగానే ఉపయోగపడుతాయి.  

ప్రధానంగా చెల్లాచెదురైన కాంగ్రెస్‌ను ఏకతాటిపైకి తీసుకురావడం ఖర్గే ముందున్న అతిపెద్ద సవాలు. ఒక మంచి విషయమేమిటంటే.. గాంధీ కుటుంబం కంటే ఖర్గే పార్టీ సభ్యులకు అందుబాటులో ఉంటారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా.. పార్టీ నైతిక స్థైర్యం పరంగా సాధారణ నాయకులు, కార్యకర్తలలో హైకమాండ్ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం.

ఈ చర్య పార్టీలోని  దిగువ వ్యక్తులతో ప్రత్యక్ష పరిచయాల పరిధిని పెంచుతుంది. 2024 దృష్ట్యా..  కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం ఖర్గేకి ఎంత ముఖ్యమో, ప్రతిపక్ష పార్టీల ఐక్యతను నిర్ధారించడం కూడా అంతే ముఖ్యం. ఖర్గే లాంటి సీనియర్, అనుభవం ఉన్న నేత రాకతో అన్ని ప్రతిపక్ష పార్టీల పెద్ద నేతలు సులభంగా చేరిపోవచ్చు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే అనుభవం అందరినీ వెంట తీసుకెళ్లే నాయకుడిగా ఆయనను ముందుకు తీసుకొచ్చింది.

'భారత్ జోడో యాత్ర' దేశవ్యాప్త పర్యటన

నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇతర ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ దేశవ్యాప్త పర్యటనలో లక్షలాది మంది చేరుతున్నారని కాంగ్రెస్ చీఫ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు