‘ఆ ఇరువురి గుణాలు మేళవించి ఉంటే.. ఇంకా మంచిది’:  జీవిత భాగస్వామిపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

By Rajesh KarampooriFirst Published Dec 29, 2022, 12:28 AM IST
Highlights

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలో వివరించారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తల్లి సోనియాగాంధీ ఇరువురి లక్షణాలు  మేళవించిన అమ్మాయి అయితే.. ఇంకా మంచిదని.. అలాంటి వారిని  తాను పెళ్లి చేసుకుంటానని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

జీవిత భాగస్వామిపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి కాలేదు.పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని మీడియా, ఇతర మిత్రులు రాహుల్ గాంధీని తరచుగా ప్రశ్నించినా.. ఆ విషయంపై సైలెంట్ గా ఉంటాడు. కానీ.. రాహుల్ గాంధీ తొలిసారి తన పెళ్లి విషయంలో మౌనం వీడి.. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పాడు.

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ..  భారత్‌ జోడో యాత్ర  పేరిట చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ ప్రత్యేక ఇంటర్వ్యూలో తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి, తన నానమ్మ ఇందిరాగాంధీ, తల్లి సోనియాగాంధీలతో ఉన్న అనుబంధాన్ని గురించి తెలిపారు. తన నానమ్మ (ఇందిరాగాంధీ) అంటే.. తనకెంతో ప్రేమని, తనకు ఆమె మరో తల్లి అని అన్నారు.

ఈ క్రమంలో తనకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలని ప్రశ్నించగా.. ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ఇది ఆసక్తికర ప్రశ్న. నానమ్మ వంటి సుగుణాలున్న మహిళ అయితే తనకు అభ్యంతరం లేదు. కానీ, అమ్మ, నానమ్మ గుణాలు మేళవించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

స్వంత కారు లేదు..  
 
ఈ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ  కార్లు, బైక్‌ల గురించి కూడా వివరంగా చర్చించాడు. తనకు స్వంత కారు లేదని, తన తల్లికి కారు ఉందని చెప్పాడు. తనకు కార్లంటే ఎప్పుడూ ఆసక్తి లేదనీ, తనకు కార్లు నడపడం అంతగా ఆసక్తి లేకున్నా.. కార్లో ఏదైనా సమస్య ఉంటే.. 90% వరకు సరిచేయగలనని అన్నారు. వేగంగా వెళ్లడం ఇష్టమనీ, గాలిలో, నీటిలో, నేలమీద వేగంగా దూసుకెళ్లే ఆలోచనను ఇష్టపడతానని చెప్పారు. కానీ బైక్ డ్రైవింగ్‌పై అంటే ఇష్టమని, తన దగ్గర మోటర్ బైక్ ఉందనీ, తాను లండన్‌లో ఉన్నప్పుడు అప్రిలియా ఆర్‌ఎస్-250 బైక్  నడిపేవాడిని, దానిని నడపడమంటే చాలా ఇష్టపడతానని తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో చైనీస్ ఎలక్ట్రిక్ కంపెనీ గురించి కూడా ప్రస్తావించాడు. తను ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడిపానని, ఎప్పుడూ ఎలక్ట్రిక్ బైక్‌ను నడపలేదని చెప్పాడు. స్వశక్తితో నడిపించే సైక్లింగ్‌ అంటే.. చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. అది శరీర బలాన్ని తీసుకుంటుంది.

 పప్పు అని పిలవడం ప్రచారంలో భాగం'

తనపై వచ్చే  విమర్శలు, పప్పు అని పిలవడానికి సంబంధించిన ప్రశ్నపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అదంతా ప్రచారంలో భాగమని ఎవరైనా తనను పప్పు అని పిలిస్తే బాధగా అనిపించడం లేదని, ఇలా మాట్లాడే వారికే ఇబ్బంది, భయం కలుగుతున్నాయని అన్నారు. ఇది ప్రచారంలో భాగమేనన్నారు. మాట్లాడేవాడికి లోపల భయం ఉంటుంది, అతని జీవితంలో ఏమీ లేదు, అతని సంబంధాలు సరిగ్గా లేవు. అతను నన్ను దుర్వినియోగం చేయవలసి వస్తే, నన్ను దుర్భాషలాడాలి, నేను అతన్ని స్వాగతిస్తాను. అని పేర్కొన్నారు. వీటితోపాటు దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు మొదలు.. డ్రోన్‌ విప్లవం వంటి ఎన్నో అంశాలపైనా రాహుల్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 
అలాగే.. ముంబాయి గురించి కూడా ప్రస్తవించారు. నాన్న ముంబైలో పుట్టారు. తాను  అక్కడ ఎక్కువ సమయం గడపలేదనీ చెప్పారు.  ముంబాయి  ఆహారం గురించి కూడా తనకు తెలియదనీ..తాను ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటానని, తాను చక్కెర, నూనె పదార్థాలు ఎక్కవగా తిననని చెప్పారు.2010లో చేసిన  రైలు యాత్ర గురించి ప్రశ్నించగా.. తాను 2010 నుంచి కాదు. ఎప్పుడూ ఈ యాత్రలు చేస్తుంటాననీ, కానీ.. కొన్ని రాజకీయ కారణాలతో పత్రికలు తనని టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. తాను ప్రారంభించే ఏ కార్యక్రమానికైనా అడ్డుపడుతున్నారనీ.. తాను చేసే పనిలో కొన్ని అంశాలను మాత్రమే ప్రెస్ చూపుతున్నారనీ తెలిపారు. తాను వలస కార్మికుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

click me!