డాక్టర్ పై కోపం.. ఆమె నుదిటిన సింధూరం దిద్దిన కాంపౌండర్..!

Published : Jul 15, 2021, 08:25 AM ISTUpdated : Jul 15, 2021, 08:28 AM IST
డాక్టర్ పై కోపం.. ఆమె నుదిటిన సింధూరం దిద్దిన కాంపౌండర్..!

సారాంశం

ఈ తతంగం మొత్తాన్ని సదరు కాంపౌండర్ స్నేహితులు ఫోటోలు, వీడియోలు తీయడం గమనార్హం. దీంతో.. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి

హాస్పిటల్ కాంపౌండర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి డాక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. బలవంతంగా డాక్టర్ గదిలోకి వెళ్లి.. ఆమె నుదుటిన సింధూరం దిద్దాడు. ఇక నుంచి నువ్వు నా భార్యవంటూ పేర్కొన్నాడు. ఈ తతంగం మొత్తాన్ని సదరు కాంపౌండర్ స్నేహితులు ఫోటోలు, వీడియోలు తీయడం గమనార్హం. దీంతో.. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో.. ఆ కాంపౌడర్ పై పోలీసులు కేసు నమోదు  చేశారు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ రాష్ట్రం సమష్టిపూర్ ప్రాంతంలోని ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో అనిమా రంజన్ వైద్యురాలిగా పనిచేస్తోంది. అదే హెల్త్ సెంటర్ లో సుమిత్ కుమార్.. కాంపౌండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. అతని పనితీరు నచ్చని డాక్టర్.. అతనిని విధుల నుంచి తొలగించింది.

దీంతో.. ఆమె మీద సుమిత్ కోపం తెచ్చుకున్నాడు. ఎలాగైనా ఆమె పై పగతీర్చుకోవాలని అనుకున్నాడు. పథకం ప్రకారం స్నేహితులతో కలిసి హెల్త్ సెంటర్ కి వెళ్లిన సుమిత్.. బలవంతంగా డాక్టర్ నుదిటిన కుంకుమ పెట్టాడు. అతని స్నేహితులు దానిని వీడియో తీశారు.

ఈ ఘటన అనంతరం.. బాధిత డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వారు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport