కరోనా డేంజర్ బెల్స్.. దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్ : మోడీ

By Siva Kodati  |  First Published Mar 24, 2020, 8:15 PM IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇవాళ రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. జనతా కర్ఫ్యూను పాటించి ప్రజలు ప్రభుత్వానికి సహకరించారని ప్రధాని మోడీ ప్రశంసించారు. 


కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇవాళ రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. జనతా కర్ఫ్యూను పాటించి ప్రజలు ప్రభుత్వానికి సహకరించారని ప్రధాని మోడీ ప్రశంసించారు.

ఈ అర్ధరాత్రి నుంచి ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధమని, ఒక రకంగా చెప్పాలంటే జనతా కర్ఫ్యూని మించిన విధంగా ఉంటుందని మోడీ తెలిపారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ తరహా వాతావరణమని, ప్రతి ఒక్కరిని చేతులేత్తి వేండుకుంటున్నా ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు.

Latest Videos

undefined

ఈ అర్థరాత్రి నుంచి ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి వీధి లాక్‌డౌన్‌లో ఉంటాయని మోడీ చెప్పారు. 21 రోజులు ఇళ్లల్లో ఉండకపోతే.. పరిస్ధితి చేయిదాటుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ 21 రోజుల బయటకు వెళ్లడమనేని మర్చిపోవాలని, ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని తెలిపారు. 

Also Read:వినకపోతే 24 గంటల కర్ఫ్యూ, అదీ కాకపోతే కనిపిస్తే కాల్చివేత: కేసీఆర్

మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు దేశమంతా ఒక్కటిగా నిలిచిందని కొనియాడారు. దేశానికి ఇది పరీక్షా సమయమని.. అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనాను ఎదుర్కోలేకపోతున్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సవాళ్లు విసురుతూనే ఉందని దీని వ్యాప్తి గురించి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నామని మోడీ తెలిపారు. కరోనాను అరికట్టాలంటే సోషల్ డిస్టెన్సింగే ఏకైక మార్గమని దీని తీవ్రత పెరిగితే.. పరిస్ధితి భయంకరంగా ఉంటుందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదని, ఈ లాక్‌డౌన్ నిర్ణయం ప్రతి  ఇంటికీ లక్ష్మణ రేఖ వంటిదని నరేంద్రమోడీ అభివర్ణించారు. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రధాని తెలిపారు.

ప్రజలంతా ఒకే పనిచేయాలి.. అది ఇళ్లలోనే ఉండటం. మన ముందు ఉన్న ఏకైక మార్గం ఇంటి నుంచి బయటకు రాకపోవడమేనని మోడీ అన్నారు. ఏమైనా సరే.. ఇంటి నుంచి బయటకు రాకూడదన్నారు.

Also Read:సర్వైవ్ లెన్స్ స్టేట్ గా తెలంగాణ: తాజాగా మరో మూడు కరోనా కేసులు

వైద్య సదుపాయాల్ని మెరుగుపరిచేందుకు గాను 15 వేల కోట్ల నిధులు సమకూరుస్తున్నామని.. అన్ని రాష్ట్రాల తొలి ప్రాధాన్యం వైద్యమే కావాలని మోడీ  సూచించారు. ప్రధాని నరేంద్రమోడీగా చెప్పడం లేదని, మీ ఇంటి సభ్యుడిగా చెబుతున్నానని దయచేసి ఎవరూ నిబంధనలను ఉల్లంఘించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఒక్క వ్యక్తి ద్వారా కరోనా వైరస్ వేలాది మందికి వ్యాపిస్తుందని ఈ సమయంలో మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రులు కూడా ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయని.. వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడొద్దని మోడీ సూచించారు. 

కరోనాపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పోరాడుతున్నాయని.. వదంతులను నమ్మొద్దని ప్రధాని విజ్ఞప్తి చేశారు. జలుబు, దగ్గు, ఉబ్బసం, ఉంటే మెడిసిన్స్ వాడొద్దని .. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నరేంద్రమోడీ సూచించారు. 24 గంటలు పనిచేస్తున్న పోలీసులు, మీడియాకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. 

click me!