మోడీ ప్రమాణస్వీకారం: సోనియా సహా ప్రముఖుల హాజరు

Published : May 30, 2019, 07:09 PM ISTUpdated : May 30, 2019, 07:27 PM IST
మోడీ ప్రమాణస్వీకారం: సోనియా సహా ప్రముఖుల హాజరు

సారాంశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి పలు దేశాల నుండి  ప్రముఖులు హాజరయ్యారు.


న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి పలు దేశాల నుండి  ప్రముఖులు హాజరయ్యారు.

గురువారం నాడు న్యూఢిల్లీలో నరేంద్ర మోడీ రెండో దఫా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో  శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన హాజరయ్యారు. దేశంలోని ప్రముఖులతో పాటు విదేశాల నుండి సుమారు 8 వేల మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందాయి.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్,  కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌, హిందీ సినీ పరిశ్రమ నుండి కరణ్ జోహార్, కంగనా రనౌత్ ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ , ఆయన సతీమణి నీతా అంబానీ , రతన్ టాటాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈషా పౌండేషన్ ఛైర్మెన్ జగ్గి వాసుదేవ్, మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పళనిస్వామి , కర్ణాటక సీఎం కుమారస్వామి, బీజేపీ అగ్రనేతలు  ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి   తదితరులు మోడీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu