ఆ లిస్టును పూర్తిగా చూస్తే అందులో మన తెలుగువారు కూడా దర్శనమిస్తారు. ఇద్దరు కూడా మాజీ ఎంపీలు అవడం గమనార్హం. టీడీపీ నేత రాయపాటి సాంబశివ రావు కు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ మనకు దర్శనమిస్తుంది. ఈయనతోపాటుగా మీడియా బారన్ గా ప్రఖ్యాతి చెంది, తెలుగు విజయ మాల్యా అనిపించుకోవాలని ఉవ్విళ్లూరే వెంకట్రామిరెడ్డి కి చెందిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కంపెనీ కూడా మనకు కనబడుతుంది.
సమాచార హక్కు చట్టం కింద భారతదేశంలోని టాప్ 50 ఉద్ధేశ్యపూర్వక ఎగవేతదారుల లిస్టును ఆర్బీఐ బయటపెట్టిన విషయం తెలిసిందే. విజయ్ మాల్యా, మేహూల్ చోక్సి, నిరవ్ మోడీల చుట్టూ ఈ చర్చ నడుస్తుండడంతో ఎవ్వరమూ ఆ లిస్టును సరిగా పట్టించుకోలేదు.
ఆ లిస్టును పూర్తిగా చూస్తే అందులో మన తెలుగువారు కూడా దర్శనమిస్తారు. ఇద్దరు కూడా మాజీ ఎంపీలు అవడం గమనార్హం. టీడీపీ నేత రాయపాటి సాంబశివ రావు కు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ మనకు దర్శనమిస్తుంది. ఈయనతోపాటుగా మీడియా బారన్ గా ప్రఖ్యాతి చెంది, తెలుగు విజయ మాల్యా అనిపించుకోవాలని ఉవ్విళ్లూరే వెంకట్రామిరెడ్డి కి చెందిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కంపెనీ కూడా మనకు కనబడుతుంది.
1915 కోట్ల అప్పుతో ఉద్ధేశ్యపూర్వక ఎగవేతదారుళ్ళూ డెక్కన్ క్రానికల్ టాప్ 10లో ఉంటె... రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ 1790 కోట్లతో టాప్ 12 లో ఉంది. 2012లో పోలవరం ప్రాజెక్టును దక్కించుకుంది ఈ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీయే!
గత ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించిన 50 మంది కార్పొరేట్లు తీసుకున్న రూ.68,607 కోట్ల రుణాలను దేశీయ బ్యాంకులు రద్దు చేశాయని తెలిపింది. వీటిలో మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాకు చెందిన సంస్థలతోపాటు దక్కన్ క్రానికల్ తదితర సంస్థల బాకీలున్నాయి.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపిన వివరాల ప్రకారం పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్, గిల్లీ ఇండియా, నక్షత్ర బ్రాండ్ బకాయిలు అత్యధికంగా రూ.8,048 కోట్లు రద్దు కావడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి 16 దాకా ఉన్న వివరాలను తెలుపాలంటూ తన దరఖాస్తులో ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఆర్బీఐని కోరారు. అయితే నిరుడు సెప్టెంబర్ 30 వరకు ఉన్న సమాచారాన్నే ఆర్బీఐ అందించింది. ఫిబ్రవరి 16దాకా సమాచారం లేదని స్పష్టం చేసింది.
ఇదిలావుంటే రద్దయిన బాకీలకు సంబంధించిన సంస్థలు, వాటి యజమానులపై సీబీఐ, ఈడీల దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇక కార్పొరేట్ల రుణాలు, ఎగవేతలు, రద్దులపై పార్లమెంట్ చివరి సమావేశాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో గొంతెత్తిన సంగతి తెలిసిందే. 2014 నుంచి నిరుడు సెప్టెంబర్ వరకు రూ.6.66 లక్షల కోట్ల రుణాలను ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.
సెప్టెంబర్ 30, 2019 నాటికి బ్యాంకుల్లో బకాయిపడ్డ రూ.68,607 కోట్ల రుణాలను నిలిపివేసినట్లు ఆర్బీఐ సమాచారహక్కుచట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఈ మేరకు ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే తన ట్విటర్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు.
also read రిలయన్స్ 30 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం: రైట్స్ ఇష్యూకు ముఖేశ్ అంబానీ
టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పడానికి నిరాకరించారని, అందుకే తాను అదే విషయంపై ఆర్టీఐని ఆశ్రయించానని గోఖలే ట్వీట్ చేశారు.
ఫిబ్రవరి 16 నాటికి టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారి ప్రస్తుత రుణ స్థితికి సంబంధించిన వివరాలను కోరగా, ఏప్రిల్ 24న తనకు ఈ సమాధానం వచ్చినట్టు గోఖలే చెప్పారు.
కాగా, ఉద్దేశపూర్వక ఎగవేతదారుల్లో డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ.5492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. చోక్సీ ఇతర సంస్థలైన గిలి ఇండియా, నక్షత్ర బ్రాండ్లు కూడా వరుసగా రూ.1,447, రూ.1,109 కోట్లు రుణాలు తీసుకుని ఎగవేశాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్‌ఈఐ ఆగ్రో రూ.4,314, విన్సమ్ డైమండ్స్ రూ.4,076 కోట్లు ఉన్నాయి.
ఇక రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,850 కోట్లు, కుడోస్ కెమీ లిమిటెడ్ రూ.2,326 కోట్లు, రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.2,212 కోట్లు, జూమ్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ రూ.2,012 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది.
విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.1,943 కోట్లతో ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఇక ప్రీషియస్ జ్యువెల్లరీ అండ్ డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,962 కోట్లు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.1,915 కోట్లు చెల్లించాల్సి ఉంది.