అమ్మాయిల వివాహ వయసు పెంపు: కేంద్రానికి కమిటీ కీలక నివేదిక

By Siva KodatiFirst Published Jan 15, 2021, 3:19 PM IST
Highlights

భారతదేశంలో యువతీ యువకుల పెళ్లిళ్లకు కనీస వయసు ఎంత అనేది అందరికీ తెలిసిందే. పురుషులకయితే 21 ఏళ్లు, స్త్రీలు అయితే 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే అన్నింటిలోనూ సమానత్వం పాటిస్తూ, స్త్రీ పురుషుల పెళ్లి వయసులో మాత్రం దాన్ని విస్మరించారంటూ మహిళా సంఘాలు, సామాజిక వేత్తలు మండిపడుతుంటరు.

భారతదేశంలో యువతీ యువకుల పెళ్లిళ్లకు కనీస వయసు ఎంత అనేది అందరికీ తెలిసిందే. పురుషులకయితే 21 ఏళ్లు, స్త్రీలు అయితే 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని చట్టం చెబుతోంది.

అయితే అన్నింటిలోనూ సమానత్వం పాటిస్తూ, స్త్రీ పురుషుల పెళ్లి వయసులో మాత్రం దాన్ని విస్మరించారంటూ మహిళా సంఘాలు, సామాజిక వేత్తలు మండిపడుతుంటరు. బాల్య వివాహాలను ఆంగ్లేయులు ఎప్పుడో నిషేధించినా.. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఈ అనాచారం జరుగుతూనే ఉన్నాయి.

చిన్న వయసులోనే పెళ్లి చేస్తే మరీ చిన్నవయసులోనే గర్భవతి కావడం జరుగుతోంది. దాని వల్ల అటు పుట్టబోయే బిడ్డ, ఇటు తల్లి కూడా ఆరోగ్య పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

చిన్న వయసులోనే కాన్పు నొప్పులను భరించలేక కన్నుమూస్తున్న వారి సంఖ్య దేశంలో వేలాల్లో వుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అమ్మాయిల పెళ్లి వయసును 21కి పెంపు సాధ్యాసాధ్యాలపై కేంద్రం గతేడాదే ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

సమతా పార్టీ మాజీ చీఫ్ జయా జైట్లీ, నీతి ఆయోగ్ సభ్యులు వీకే పౌల్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పడింది. ఆరోగ్య శాఖ సెక్రటరీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ, ఉన్నత విద్యాశాఖ, ప్రాధమిక విద్యాశాఖ సెక్రటరీలు, ముంబైలోని ఎస్ఎన్ డీటీ మహిళా యూనివర్శిటీ ఛాన్సలర్, గుజరాత్ లోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దీప్తీ షాహ్ లతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటయింది.

ఈ నేపథ్యంలో ’అమ్మాయిల కనీస పెళ్లి వయసు‘ గురించి ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. అందులో ఏమేం ప్రతిపాదనలు చేసిందంటే.. 

మన దేశంలో రాత్రికి రాత్రే అమ్మాయిల పెళ్లి వయసును 21కి పెంచడం సాధ్యం కాదని కమిటీ తేల్చింది. ఇది దశల వారీగా జరగాలని.. అలాగే దీన్ని అమలు చేసేందుకు రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని సిఫారసు చేసింది.

అలాగే అమ్మాయిల పెళ్లి వయసు 21కి పెరిగితే చాలా లాభాలు ఉన్నాయి. కుటుంబాలు ఆర్థికంగా బలపడటంతో పాటు అమ్మాయిల్లో మానసిక పరిపక్వత కూడా పెరిగి, సమాజం గురించి అవగాహన వస్తుందని కమిటీ తెలిపింది. అమ్మాయిలు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో వారి వయసు తప్పనిసరిగా 21 ఏళ్లు ఉంటే ఆరోగ్య పరంగానూ ఇబ్బందులు ఎదురవ్వవని పేర్కొంది. 

click me!