Sharad Pawar: ఆ పార్టీ ప్రాంతీయ పార్టీల‌ను అంతం చేస్తోంది.. శ‌ర‌ద్ ప‌వార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Rajesh KFirst Published Aug 10, 2022, 10:42 PM IST
Highlights

NCP Sharad Pawar: ప్రాంతీయ‌ మిత్ర పార్టీలను బీజేపీ అంతం చేస్తున్నదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ విమర్శించారు. మహారాష్ట్రలో చాలా ఏళ్లుగా కలిసి ఉన్న శివసేన, బీజేపీ .. ప్రస్తుతం శివసేనను చీల్చిన బీజేపీ ఆ పార్టీని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, దీని కోసం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి సహకరించిందని ఆరోపించారు.

NCP Sharad Pawar:  భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారం కోసం ప్రాంతీయ మిత్రులను అంతం చేస్తున్నదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శ‌రద్ పవార్ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని, రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని.. తొలుత‌ బీజేపీ  అధికారం కోసం ప్రాంతీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకుని.. ఆ పార్టీల‌ను అంతం చేయ‌డానికి ప్ర‌య‌త్నింద‌ని ఆరోపించారు. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి), మహారాష్ట్రలో శివసేన వంటి ప్రాంతీయ మిత్రపక్షాలతో పొత్తుపెట్టుకుని, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ పార్టీల అంతం చేయాల‌ని భావించింద‌నీ అన్నారు. ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీతో చేతులు కలపడం బిజెపి ప్రత్యేకత అని, ఈ క్ర‌మంలో స్థానిక మిత్రపక్షం తక్కువ సీట్లు గెలుచుకునేలా చూడటం కూడా బీజేపీ కుట్ర‌నేన‌ని అన్నారు. 
 
కుటుంబాల నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ క్రమంగా మిత్రపక్షాలను తొలగిస్తుందని బీజేపీ చీఫ్ ప్రకటన స్పష్టం చేస్తోందని పవార్ అన్నారు. ఇదే స‌మ‌యంలో నితీష్ కుమార్ ఆరోప‌ణ‌ల‌ను కూడా ప్ర‌స్త‌వించారు. మ‌హారాష్ట్ర‌లో శివసేన పార్టీని చీల్చి ఎలా బలహీనపరచారో?  బీజేపీ కుట్ర‌ను అంద‌రూ అర్థం చేసుకుంటున్నార‌నీ, బిజెపి ప్లాన్ ప్ర‌కారమే.. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశార‌నీ, ఆ తిరుగుబాటు విజ‌యవంతం కావ‌డంతో షిండే సీఎం అయ్యారని, మరికొందరు (బీజేపీ) ఆయనకు సహకరించారని ఆయన అన్నారు. బీజేపీ భావజాలం వ‌ల్ల పాంత్రీయ పార్టీల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌నీ,  ఇలా చేస్తే.. ప్రాంతీయ పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించ‌లేవ‌ని అన్నారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని, ఆర్జేడీతో కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని గంటల తర్వాత పవార్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, శివసేన రెబల్‌ వర్గం వివాదాన్ని వీడి మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని శరద్‌ పవార్‌ సూచించారు. విభేదాలతో కాంగ్రెస్‌ను వీడిన తాను కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కొత్త గుర్తుతో ప్రజల్లోకి వెళ్లానని అన్నారు. బీజేపీకి ద్రోహం చేసినందుకు శివసేన విరుచుకుపడిందని సుశీల్ మోదీ చేసిన ప్రకటనపై  కూడా శరద్ పవార్ విమర్శించారు.

'అధికారం కేంద్రీకృతమైంది'
శ్రీలంకను ఒకే కుటుంబం పాలించింది. రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రి ఒకే కుటుంబానికి చెందినవారు. శ్రీలంకలో అధికారం కేంద్రీకృతమైంది. దీంతో అసంతృప్తి పెరగడం మొదలైంది. దీంతో ప్రజానీకం ఉలిక్కిపడింది. శ్రీలంకలో ఉన్న పరిస్థితి ఒక రోజు లేదా కొన్ని నెలలు కాదు. కొన్నేళ్ల నాటిదని తెలిపారు.

click me!