అమరుడైన కల్నల్ సంతోష్ బాబు తల్లితో చెప్పిన చివరి మాటలు...

By Sreeharsha GopaganiFirst Published Jun 17, 2020, 12:14 PM IST
Highlights

గత ఏడాది మార్చ్ నెలలో భార్య పిల్లలతో కలిసి సూర్యాపేటకు వచ్చాడు. హైద్రాబాబ్డ్ కు త్వరలోనే ట్రాన్స్ఫర్ అవనున్నట్టుగా చెప్పాడు. నాలుగు రోజుల క్రితం క్షేమంగా ఉన్నానని తల్లి మంజులతో సంతోష్ చివరి సారిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. సంతోష్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

భారత చైనా సరిహద్దుల్లో దేశం కోసం మన తెలుగు వ్యక్తి కల్నల్ సంతోష్ బాబు అమరుడయ్యాడు. కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేట జిల్లా వాసి. సూర్యాపేట లోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేసాడు. ఆ తరువాత కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశపరీక్ష రాసి అందులో ఉత్తీర్ణుడయి విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక పాఠశాలలో 6వ తరగతి నుండి 12వతరగతి వరకు విద్యను అభ్యసించాడు. 

చిన్నప్పటినుండి సైన్యంలో చేరాలని కలలుగన్న సంతోష్ బాబు అందుకు తగ్గట్టుగానే కోరుకొండ సైనిక్ స్కూల్ లో చేరాడు. ఆతరువాత ఎన్డీయే ఎగ్జామ్ క్లియర్ చేసి పూణే ఎన్డీఏ లో డిగ్రీ పూర్తి చేసాడు. ఆతరువాత ఆఫీసర్ స్థాయి అధికారిగా డెహ్రాడూన్ లో ట్రైన్ అయ్యాడు. 

ట్రైనింగ్ పూర్తయిన అనంతరం ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో వచ్చింది. అతి చిన్న వయసులోనే సంతోష్ కల్నల్ స్థాయికి ఎదిగారు. 2004లో ఆర్మీలో చేరిన సంతోష్ బాబు, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, పుల్వామా ఇలా అనేక ప్రాంతాల్లో పనిచేసారు. 

విధుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి గోల్డ్ మెడల్స్ సాధించారు.కుప్వారాలో ముగ్గురు పాకిస్తానీ ముష్కరులను మట్టుబెట్టి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా ప్రశంసాపత్రాన్ని, మెడల్ ని కూడా పొందారు. 

16 బీహార్ రెజిమెంట్‌కు కమాండెంట్ అధికారిగా సంతోష్ విధులు నిర్వర్తిస్తున్నారు.  మార్చిలో సంతోష్ కుమార్‌కు హైదరాబాద్‌కు బదిలీ  అవగా...కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల కొత్తవారు వచ్చేదాకా అక్కడే డ్యూటీ చేయవలిసిందిగా ఆదేశాలు వచ్చాయి. దీనితో అక్కడే విధుల్లో ఉండిపోయాడు సంతోష్. 

గత ఏడాది మార్చ్ నెలలో భార్య పిల్లలతో కలిసి సూర్యాపేటకు వచ్చాడు. హైద్రాబాబ్డ్ కు త్వరలోనే ట్రాన్స్ఫర్ అవనున్నట్టుగా చెప్పాడు. నాలుగు రోజుల క్రితం క్షేమంగా ఉన్నానని తల్లి మంజులతో సంతోష్ చివరి సారిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. సంతోష్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనకు భార్య సంతోషి, పిల్లలు అనిల్ తేజ, అభిజ్ఞ ఉన్నారు. వారు ఢిల్లీలో ఉంటున్నారు. 

నేటి ఉదయం సంతోష్ కుమార్ భార్య పిల్లలు ఢిల్లీ నుండి హైదరాబాద్ కి చేరుకున్నారు. వారిని ఎయిర్ పోర్టులో పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుండి సంతోష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు బయల్దేరారు. 

click me!