ప్లే బాయ్ సర్వీసులు అందిస్తానని ఆఫర్.. కాలేజీ స్టూడెంట్ అరెస్టు.. ఛత్తీస్‌గడ్‌లో ఘటన

By Mahesh KFirst Published Dec 31, 2022, 7:45 PM IST
Highlights

ప్లే బాయ్ సర్వీసులు అందిస్తానని, కాంటాక్టు నెంబర్ రాసిన చిట్టీలను ఛత్తీస్‌గడ్‌లోని  ఓ కాలనీలో కొన్ని విసిరేశారు. వాటిని చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనై పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఫోన్ చేసి ఆ స్టూడెంట్‌ లొకేషన్‌ను ట్రేస్ చేశారు. అరెస్టు చేశారు. అయితే, ఒక అమ్మాయిని వేధించడంలో భాగంగా ఈ పనికి వేరేవారు పాల్పడి ఉండొచ్చనే పోలీసులు అనుమానిస్తున్నారు.
 

న్యూఢిల్లీ: ప్లే బాయ్ సర్వీసులు అందిస్తా అని ఓ చిట్టీలపై రాసి వాటిని విసిరేశారు. అందులో స్టూడెంట్ పేరు, ఫోన్ నెంబర్ రాశారు. కొన్నాళ్లుగా వాటిని తీసుకున్న ఓ కాలనీ నివాసులు చిర్రెత్తిపోయారు. తీవ్ర ఆగ్రహానికి లోనై ఎవరా అని కనుక్కునే ప్రయత్నం చేశారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఓ కాలేజీ స్టూడెంట్‌ను అరెస్టు చేశారు.

ఛత్తీస్‌గడ్ నవా రాయ్‌పూర్‌లోని సెక్టార్ 30, అవినాశ్ న్యూ కాలనీలో ఈ ఘటన రిపోర్ట్ అయింది. కొంత మంది అక్కడి స్థానికులు వింతైన చిట్టీలు కనిపించాయి. ఆ చిట్టీల్లో విద్యార్థి తనను తాను ప్లే బాయ్‌గా పేర్కొన్నారు. అలాగే, కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసి.. లైంగికంగా కలవడానికి ఆఫర్ ఇచ్చారు.

ఈ అభ్యంతరకర చిట్టీలతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఆ చిట్టీలు వేసిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ, కనిపెట్టలేకపోయారు. అప్పుడు స్థానికులు రాఖీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు.

రాఖీ పోలీసు స్టేషన్ ఇంచార్జీ రాజేంద్ర జైస్వాల్ ఈ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించారు. చిట్టీలోని ఆ నెంబర్‌కు కాల్ చేశారు. ఆ కాల్‌ను రిసీవ్ చేసుకోగనే అతని లొకేషన్‌ను పోలీసులు ట్రేస్ చేశారు.

Also Read: బట్టలు విప్పేసుకుని మహిళ వెంటపడి.. కోరిక తీర్చాలంటూ.. మహారాష్ట్రలో కామాంధుడి వీరంగం..

పోలీసుల వివరాల ప్రకారం, ఆ విద్యార్థి నవ రాయ్‌పూర్‌లోని ఓ కాలేజీలో చదువుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని విచారిస్తున్నారు. ఇలా చిట్టీలు ఎందుకు వేశావనే కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలేవీ ఇప్పుడే బయటపెట్టడానికి వారు నిరాకరించారు. 

అయితే, వేరే ఇంకెవరైనా అతడి పేరిట చిట్టీలు విసిరేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ చిట్టీపై రాసిన ఫోన్ నెంబర్ ఓ అమ్మాయి నెంబర్ అని, ఆమెను వేధించడానికే అలా చిట్టీలను పంచి ఉంటారా? అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

click me!