Assembly Election Results 2022: రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారం, 2004లో మూడు రాష్ట్రాల్లోనే

Published : Mar 10, 2022, 01:16 PM IST
Assembly Election Results 2022: రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారం, 2004లో మూడు రాష్ట్రాల్లోనే

సారాంశం

దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైంది.  ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2004 లో దేశంలో మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది.  

న్యూఢిల్లీ: తాజాగా జరిగిన వచ్చిన  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో Congress కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రె్స కోల్పోయింది. దీంతో దేశంలో రెండు రాష్ట్రాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నిరాశ నెలకొంది.

Punjab రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా జరిగిన Uttar Pradesh, ఉత్తరాఖండ్, Manipur, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ ఆశించిన  ఫలితాలను దక్కించుకోలేదు. అధికారంలో ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది.ఈ ఎన్నికల్లో  పంజాబ్ రాష్ట్రంలో ఆప్ అధికారాన్ని చేపట్టనుంది.

దేశంలో ప్రస్తుతం chhattisgarh, Rajastan రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో  సచిన్ పైలెట్ వర్గానికి సీఎం ఆశోక గెహ్లాట్ వర్గానికి మధ్య కొంత కాలంగా  అగాధం ఉంది. సచిన్ పైలెట్ వర్గాన్ని గత కొంతకాలం క్రితం పార్టీ నాయకత్వం ఈ రెండు వర్గాల మధ్య సయోధ్యను కుదిర్చారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు కూడా ఈ రెండు రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఛత్తీస్‌ఘడ్ లో  కూడా CMపై కొంత అసమ్మతి ఉంది. 

2004లో  దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఆ సమయంలో మధ్యప్రదేశ్, ఒడిశా,మిజోరం రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఆ సమయంలో మధ్య ప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్,  ఒడిశాలో జేబీ పట్నాయక్, మిజోరం లో లల్తాన్ హావ్లా సీఎంలుగా ఉన్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014 తర్వాత ఆ పార్టీ తిరిగి అధికారానికి దూరమౌతూ వచ్చింది. 

గత ఏడేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఛత్తీ‌స్‌ఘడ్, మధ్యప్రదేశ్, పంజాబ్, పుదుచ్చేరిలలో కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే స్వంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్  ప్రభుత్వాన్ని కోల్పోయింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu