షాకింగ్: కదులుతున్న వాహనంలో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

Published : Dec 25, 2020, 07:57 AM IST
షాకింగ్: కదులుతున్న వాహనంలో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

సారాంశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈటా జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. కదులుతున్న వాహనంవలో బిఎస్సీ విద్యార్థినిపై మరో విద్యార్థి అత్యాచారం చేశాడు. ఇందుకు డ్రైవర్ సహకరించాడు.

ఈటా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. కదులుతున్న వాహనంలో ఓ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. కాలేజీకి వెళ్తున్న బిఎస్సీ విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్చాచారం చేశాడు. రేపిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఈటా జిల్లాలోని భగ్వాలా పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారంనాడు చోటు చేసుకుంది. బుధవారం ఉదయం యువతి ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరింది. 

విద్యార్థిని కాలేజీకి వెళ్లడానికి టెంపో ఎక్కింది. టెంపోలో ఇతర విద్యార్థులు కూడా ఉన్నారు. కాలేజీకి చేరగానే విద్యార్థులంతా దిగిపోయారు. విద్యార్థిని కూడా దిగడానికి సంసిద్ధం అవుతుండగా ఒక్కసారిగా డ్రైవర్ టెంపోను ముందుకు కదలించాడు

దాంతో టెంపో ముందుకు సాగింది. ఈ క్రమంలో డ్రైవర్ తో పాటు ఉన్న ఓ విద్యార్థి యువతిపై అత్యాచారం చేశాడు. దీన్ని గమనించిన కొంత మంది టెంపోను ఆపి, యువతిని రక్షించారు. సంఘటన తర్వాత యువతిని ఆస్పత్రికి పంపించారు. 

బాధితురాలి తం్డరి తహ్రీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేపిస్టు యువకుడితో పాటు కుట్రలో పాలు పంచుకున్న టెంపో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు.  

PREV
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu