ముంబై బార్ ఓనర్ల నుండి రూ.4.75కోట్లు వసూలు...: ఈడీ విచారణలో సచిన్ వాజే

Arun Kumar P   | Asianet News
Published : Jun 27, 2021, 08:32 AM ISTUpdated : Jun 27, 2021, 08:37 AM IST
ముంబై బార్ ఓనర్ల నుండి రూ.4.75కోట్లు వసూలు...: ఈడీ విచారణలో సచిన్ వాజే

సారాంశం

ఈడీ(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణలో సస్పెండెడ్ పోలీస్ అధికారి సచిన్ వాజే మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సంచలన ఆరోపణలు చేశారు. 

ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల వాహనం లభించిన కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ కేసుతో సంబంధాలున్నాయంటూ సస్పెండ్ అయిన పోలీస్ అధికారి   సచిన్ వాజే ఆరోపణల నేపధ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికి ఆయనను వాజే వదిలిపెట్టడం లేదు. తాజాగా మాజీ హోంమంత్రిపై సచిన్ మరిన్ని అవినీతి ఆరోపణలు చేశారు. 

ఈడీ(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణలో ముంబైలోని బార్ల నిర్వహకుల నుండి రూ.4.70 కోట్లు వసూలు చేసినట్లు వాజే తెలిపినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని మాజీ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పిఏ(వ్యక్తిగత సహాయకుడు)కు అందించినట్లు వాజే వెల్లడించినట్లు ఈడీ తెలిపింది. 

read more  ఆ మంత్రులు తోడు దొంగలు: సచిన్ వాజే సంచలన ఆరోపణలు.. వివాదంలో మరో ‘‘అనిల్’’

బార్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయమని మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించినట్లు సచిన్ వాజే ఆరోపించారు.డబ్బులు వసూలు చేయడమే నీ ఉద్యోగమని అనిల్ దేశ్‌ముఖ్ అన్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ కేసు.. సచిన్ వాజే చేసిన తాజా ఆరోపణలతో మరింత కాకరేపుతోంది.  

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?