కొలీగ్ తల నరికి హత్య చేసిన కేసులో నిందితుడికి విముక్తి.. కోర్టు ఏమన్నదంటే?

Published : Apr 16, 2023, 11:01 PM IST
కొలీగ్ తల నరికి హత్య చేసిన కేసులో నిందితుడికి విముక్తి.. కోర్టు ఏమన్నదంటే?

సారాంశం

కొలీగ్ తల నరికి దేహాన్ని వేరే చోట పడేసిన కేసులో నిందితుడికి కోర్టు విముక్తి ప్రసాదించింది. మహారాష్ట్రలో ఓ చైనీస్ ఈటరీలో పని చేసే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరో వర్కర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు నేరం చేసినట్టుగా సరైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేదని కోర్టు పేర్కొంది.  

థానే: కొలీగ్‌ను తల నరికి చంపేసిన కేసులో నిందితుడికి కోర్టు విముక్తి ప్రసాదించింది. మహారాష్ట్రలోనే థానే జిల్లాలో ఓ కోర్టు 38 ఏళ్ల నేపాలీ జాతీయుడికి ఈ దారుణ మర్డర్ కేసు నుంచి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా, ఆయనే నేరం చేశాడని చూపించే సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేదని కోర్టు పేర్కొంటూ ఏప్రిల్ 10న ఈ తీర్పు వెలువరించింది.

అదనపు సెషన్స్ జడ్జీ కళ్యాణ్ షౌకత్ ఎస్ గొర్వాడే.. నిందితుడు రాజేశ్ కుమార్ నేపాలీ అలియాస్ యగ్నప్రసాద్ కాలురాం పుఖ్రేల్‌ను నిర్దోషిగా పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్లు 302(మర్డర్), 201(సాక్ష్యాధారాల ధ్వంసం) అభియోగాల నుంచి విముక్తి కల్పించింది.

ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం, నిందితుడు, మృతుడు ఓ చైనీస్ ఈటరీలో పని చేసేవారు. అది బద్లాపూర్ కర్జత్ హైవేపై కట్రాప్ దగ్గర ఈ ఈటరీ ఉన్నది. 2017 ఏప్రిల్ 14న ఈటరీ యజమానులు, సిబ్బంది కలిసి ఆ షాపులోనే పార్టీ చేసుకున్నారు. అనంతరం, అందరూ వెళ్లిపోగా.. షాపులో నిందితుడు, మృతుడు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ మరుసటి రోజు ఈటరీ సమీపంలో ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌లో బాధితుడి తల కనిపించింది. అక్కడి నుంచి సుమారు 1000 అడుగుల దూరంలో ఆ వ్యక్తి దేహాన్ని పోలీసులు గుర్తించారు.

Also Read: విద్యార్థులతో లైంగిక సంబంధాలు.. రెండు రోజుల వ్యవధిలో వెలుగులోకి ఆరుగురు మహిళా టీచర్ల కీచక పర్వం..

నిందితుడిని పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో భూసావల్ దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు యూపీకి బయల్దేరి వెళ్లిపోతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు.

నిందితుల ఐడెంటిఫికేషన్ పరేడ్‌ను పోలీసులు నిర్వహించలేదని, తద్వార ఆ తలను ఉంచిన కవర్ ఎవర పడేశారో ఐడెంటిఫై చేయలేకపోయారని కోర్టు తెలిపింది. అలాగే, విశ్వసనీయ సీసీటీవీ ఫుటేజీని కూడా సమర్పించలేదని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

80వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal