మనిషి పగ... కాటేసిందని పామును కొరికి, కొరికి చంపి, మెడలో వేసుకుని.. ఊరంతా ఊరేగి..

By Bukka SumabalaFirst Published Sep 8, 2022, 1:19 PM IST
Highlights

పాము తనని కరిచిందని.. ఓ వ్యక్తి ఉక్రోషంతో ఆ పామును పట్టుకుని.. కసితీరా కొరికేశాడు. మనిషి కాటుకు తట్టుకోలేని ఆ పాము దెబ్బుకు చచ్చిఊరుకుంది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. 

ఒడిశా :  మనిషి  పాము మీద పగపట్టాడు. మీరు విన్నది నిజమే..  పాము మనిషి మీద పగపట్టడం గురించి కాదు… మనిషి పాము మీద పగ పట్టడం గురించి ఈ స్టోరీ. మనిషి పామును కరవడంతో అది మృతి చెందింది. ఇదేదో ఫిక్షనల్ కథ కాదు. అచ్చమైన నిజ జీవిత వాస్తవం. ఒడిశాలోని బలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. బోలా శంకరుడి తరహాలో కాటేసి.. చంపేసిన పామును మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు ఓ ప్రబుద్ధుడు. మనసునిండా ఉక్రోషంతో పాము మీద పగ తీర్చుకున్నాడు. ఈ దృశ్యం గ్రామస్తులు, చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే.. బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామానికి చెందిన సలీం నాయక్ తన పొలంలో బుధవారం ఉదయం పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతని కాలిపై నాగుపాము కాటేసింది.  అది చూసి అతను భయపడలేదు సరికదా.. కోపంతో, ఉక్రోషంతో ఉడికిపోయాడు. తనను కాటేసి అక్కడినుంచి పారిపోతున్న సర్పాన్ని వెంబడించి పట్టుకున్నాడు. తననే కాటేస్తుందా.. అనుకున్నాడో ఏమో.. దాన్ని తానే కాటేసి చంపాలనుకున్నాడు. అంతే.. పామును ఒడిసి పట్టుకుని.. పాము తల, తోకలను గట్టిగా పట్టుకుని మిగిలిన భాగం అంతా ఇష్టం వచ్చినట్టు.. ఎక్కడ పడితే అక్కడ కసిగా కొరికేశాడు. పాము తోలు ఊడిపోయి.. మాంసం బయటపడేంత వరకు పట్టు వదలకుండా కొరికాడు. అప్పటికి గానీ అతను శాంతించలేదు. 

తమిళనాడు స్కూల్ లో దారుణం.. బాత్రూంలో ప్రసవం, పెన్నుతో బొడ్డుతాడు కోసి.. అక్కడే వదిలేసిన వైనం..

బాధ తట్టుకోలేని పాము.. తన నోటితో తానే కాటేసుకునేలా చేశాడు. ఆ తరువాత చనిపోయిన సర్పాన్ని మెడకు చుట్టుకుని.. ఊరంతా ఊరేగాడు. ఇది చూసిన వారు.. పామును చూసినదానికంటే సలీం నాయక్ ను చూసి ఎక్కువగా భయపడ్డారు. నోటమాట రాకుండా నివ్వెరపోయారు. అయితే, పామును చంపేసిన అతను.. అంతకుముందు తనను కాటేసిన పాము కాటుకు మాత్రం ఎలాంటి వైద్యం చేయించుకోలేదు. తనకు పాము మంత్రం తెలుసని, తాను తాంత్రికుడినని, చికిత్స, వైద్యం నిరాకరించాడు. సంప్రదాయం ప్రకారం చంపిన పామును దహనం చేయకుండా.. ఖననం చేస్తున్నట్లు వివరించాడు. కాగా, ఈ ఘటన మీద వన్యప్రాణుల సంరక్షణ వర్గాలు స్పందించకపోవడం గమనార్హం. 

click me!