ఈ బాలుడు మామూలోడు కాదు ... సీఎం యోగికే చెక్ పెట్టేసాడు

By Arun Kumar PFirst Published Oct 5, 2024, 1:38 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను దేశంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ప్లేయర్ కుశాగ్ర అగర్వాల్‌ కలిసాడు. యోగి ఆదిత్యనాథ్ ఆ బాలుడితో చెస్ ఆడి, అతని నైపుణ్యాలను ప్రోత్సహించారు.

గోరఖ్‌పూర్ : క్రీడలన్నా, క్రీడాకారులన్నా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రేమను ప్రదర్శిస్తుంటారు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో పాల్గొన్న యూపీ క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్నిబట్టే ఈ విషయం అర్థం అవుతుంది. యువతను క్రీడలవైపు మళ్ళించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రోత్సాహకాలు అందించారు. తాజాగా ఓ చిన్నారి క్రీడాకారుడికి ప్రోత్సాహకంగా కొద్దిసేపు అతడితో సరదాగా గడిపారు సీఎం యోగి ఆదిత్యనాథ్. 

క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిచడంలో సీఎం యోగి ఎప్పుడూ ముందుంటారు. అతడి దృష్టిలో పడ్డారంటే చాలు... ఆ క్రీడాకారులను కలిసేందుకు ఆయనే చొరవ చూపిస్తుంటారు. ఇలా తన సొంత నియోజకవర్గం  గోరఖ్ పూర్ పర్యటనలో ఓ చిన్నారి చెస్ ప్లేయర్ ను కలిసారు యోగి.  దేశంలోనే  అతి చిన్న FIDE చెస్ ప్లేయర్ కుశాగ్ర అగర్వాల్ తో సరదాగా చెస్ ఆడారు సీఎం యోగి. 

Latest Videos

ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లో వున్నారు. ఈ విషయం తెలిసి అదే ప్రాంతానికి చెందిన చెస్ ప్లేయర్ కుశాగ్ర అగర్వాల్ గోరఖ్ నాథ్ ఆలయానికి చేరుకున్నాడు. సీఎంను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని ఆ బాలుడు భావించాడు... కాానీ అతడితో చెస్ ఆడి జీవితంలో గుర్తుండిపోయే గిప్ట్ ఇచ్చారు యోగి. ఈ చిన్నారితో చెస్ గేమ్ గురించి, ఎత్తులు, పావులు కదపడం గురించి చర్చించారు.

ఎవరీ కుశాగ్రా అగర్వాల్ : 

గోరఖ్ పూర్ కు చెందిన కుశాగ్ర అగర్వాల్ చిన్నతనం నుండే చెస్ పై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రస్తుతం అతడి వయసు కేవలం 5 సంవత్సరాల 11 నెలలు మాత్రమే.  ప్రస్తుతం యూకేజీ చదువుతున్నాడు. ఈ వయసులోనే అతడు చెస్ లో అద్భుతాలు చేస్తున్నాడు.

కుశాగ్ర సాధన అతని వయసు కంటే చాలా గొప్పది. 1428 రాపిడ్ ఫిడే రేటింగ్‌తో అతను ప్రస్తుతం భారతదేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఫిడే-రేటెడ్ చెస్ ప్లేయర్ గాా నిలిచాడు. కేవలం 4 సంవత్సరాల వయస్సులోనే చెస్ ఆడటం ప్రారంభించిన అతను ఒక్క సంవత్సరంలోనే తన ప్రతిభతో ఫిడే రేటింగ్‌ను సాధించాడు. చెస్‌లో తొలి శిక్షణ అతని సోదరి అవికా నుండి లభించింది, ఆమె కూడా అద్భుతమైన చెస్ ప్లేయర్. పాట్నా, బెంగళూరు, పూణేలలో జరిగిన అనేక అంతర్జాతీయ ఫిడే రేటెడ్ పోటీలలో కుశాగ్ర ఇప్పటికే పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు.

గోరఖ్‌నాథ్ ఆలయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుశాగ్రను ఆశీర్వదించడమే కాకుండా అతనితో చెస్ ఆడి ప్రోత్సహించారు. చెస్ ఎత్తుల గురించి కూడా చర్చించారు. కుశాగ్ర అగర్వాల్ ప్రతిభను మెరుగుపరచడానికి యూపీ ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చెస్‌లో అంతర్జాతీయ ర్యాంక్ సాధించిన ఈ చిన్నారి రాబోయే కాలంలో గోరఖ్‌పూర్, రాష్ట్రం పేరును ప్రపంచవ్యాప్తంగా చెరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

click me!