గోరఖ్ పూర్ లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుకుంటారో తెలుసా? సీఎం యోగి ప్రత్యేక పూజలు

By Arun Kumar P  |  First Published Oct 4, 2024, 9:12 PM IST

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరక్షపీఠంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. శక్తిపీఠంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య కలశ స్థాపన చేసి, అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించారు. ఈ వేడుకలో సాధువులు, సంతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


గోరఖ్‌పూర్ :  నాథ్ సంప్రదాయ స్థాపకుడు గురు గోరఖ్‌నాథ్ తపస్సుచేసిన స్థలం గోరక్షపీఠంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో మొదటి రోజయిన గురువారం పీఠం సాాంప్రదాయ పద్దతిలో అమ్మవారికి పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. ఇందులో గోరక్ష పీఠాధిపతి, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ పూజ నిర్వహించారు. 

గోరక్షపీఠాధిపతి మఠం మొదటి అంతస్తులో ఉన్న శక్తిపీఠంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య కలశ స్థాపన చేసారు యోగి ఆదిత్యనాథ్. మొదటి రోజు మా శైలపుత్రిని భక్తి శ్రద్దలతో పూజించారు. శారదీయ నవరాత్రి ప్రతిపద వేడుకలు మా జగన్మాతను ఆరాధించడం, దేవి పారాయణం, హారతి, క్షమా ప్రార్థనతో ముగిశాయి.

Latest Videos

undefined

కలశ స్థాపనకు ముందు గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో భారీ కలశ ఊరేగింపు సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం గోరఖ్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారి యోగి కమల్‌నాథ్ నేతృత్వంలో సాధువులు, సంతుల ఊరేగింపు సంప్రదాయ వాయిద్య పరికరాలైన గంటలు, ఢంకాలు, తురాయి, శంఖనాదాలు, దుర్గమ్మ జయజయఘోషల మధ్య  భీమ్ సరోవర్‌కు చేరుకుంది. అక్కడ కలశంలో నీటిని నింపుకుని ఊరేగింపు తిరిగి శక్తిపీఠానికి చేరుకుంది. ఆ నిండు కలశాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా తీసుకెళ్లి శక్తిపీఠంలోని గర్భగుడిలో వేద మంత్రోచ్ఛారణల మధ్య వరుణ దేవుడిని ఆవాహన చేసి ప్రతిష్టించారు.

గోరక్షపీఠాధిపతి ముందుగా గురు గోరఖ్‌నాథ్ ఆయుధం త్రిశూలాన్ని ప్రతిష్టించి గౌరీ-గణేష్‌లను ఆరాధించారు. దీంతో పాటు దుర్గా మందిరం (శక్తిపీఠం) గర్భగుడిలో శ్రీమద్దేవీభాగవతం పారాయణం, శ్రీ దుర్గాసప్తశతి పారాయణం కూడా ప్రారంభమయ్యాయి. పారాయణం తర్వాత హారతి, ప్రసాద పంపిణీ జరిగాయి.

కలశ ఊరేగింపులో నీళ్లు నింపడానికి కాళిబరి మహంత్ రవీంద్ర దాస్, యోగి ధర్మేంద్రనాథ్, నర్మదా తీర్థం నుంచి యోగి హనుమాన్‌నాథ్, బలియా నుంచి సుజిత్ దాస్, వృందావన్ నుంచి అనుపానంద్‌తో పాటు గోరఖ్‌నాథ్ ఆలయానికి చెందిన యోగులు, సాధువులు, సంతులు తదితరులు పాల్గొన్నారు.

click me!