మణిపూర్ లో భూకంపం: మయన్మార్ లో భూప్రకంపనలు

By telugu teamFirst Published Jul 9, 2021, 8:12 AM IST
Highlights

మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున భూకంపం వచ్చింది. ఫలితంగా మయన్మార్ లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఎస్సీఎస్ తెలిపింది.

న్యూఢిల్లీ: మణిపూర్ లో భూకంపం చోటు చేసుకుంది. మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రెక్టర్ స్కేలుపై ఈ భూకంపం 4.5గా నమోదైంది. ఫలితంగా మయన్మార్ లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 

మణిపూర్ లోని ఉఖ్రుల్ కు 57 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూమికి 90 కిలోమీటర్ల లోతులో ఇది చోటు చేసుకున్నట్లు తెలిపింది. శుక్రవారం ఉదయం 5 గంటల 57 నిమిషాల ప్రాంతంలో భూకంపం వచ్చింది. 

 

Earthquake of Magnitude:4.5, Occurred on 09-07-2021, 05:56:27 IST, Lat: 24.70 & Long: 94.99, Depth: 90 Km ,Location: 57km ESE of Ukhrul, Manipur, India for more information download the BhooKamp App https://t.co/Ueaa7yYCKD pic.twitter.com/BioKIxrq4b

— National Center for Seismology (@NCS_Earthquake)
click me!