సెల్ఫీ కోసం రూల్స్ బ్రేక్ చేసిన సీఎం భార్య

Published : Dec 24, 2019, 12:15 PM IST
సెల్ఫీ కోసం రూల్స్ బ్రేక్ చేసిన సీఎం భార్య

సారాంశం

ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్ఫీ అనేది ఒక ట్రెండ్. ఈ సెల్ఫీ ప్రస్తుతం అందరికీ ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు ఒక్క క్లిక్కుమనిపించి వెంటనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అందరికి ఓ అలవాటుగా మారిపోయింది. సెల్ఫీ కోసం ఎక్కడ లేని స్టంట్లు చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. 

ముంబై : ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్ఫీ అనేది ఒక ట్రెండ్. ఈ సెల్ఫీ ప్రస్తుతం అందరికీ ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు ఒక్క క్లిక్కుమనిపించి వెంటనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అందరికి ఓ అలవాటుగా మారిపోయింది. సెల్ఫీ కోసం ఎక్కడ లేని స్టంట్లు చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ ట్రెండ్‌ సెలబ్రిటీలకు మినహాయింపేమీ కాదు. 

అయితే మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృత ఫడ్నవీస్ సైతం సెల్ఫీ కోసం తెగ పాట్లు పడ్డారు. అంతేకాదు రూల్స్ బ్రేక్ చేశారు కూడా. భారతదేశపు తొలి దేశియ ప్రయాణీకుల నౌకలో ప్రయాణించిన ఆమె పర్‌ఫెక్ట్‌ సెల్ఫీ కోసం భద్రతా లైన్‌ దాటారు. భద్రతా సిబ్బంది ఎంత వారించిన ఆమె పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు. అధికారులు వారిస్తున్నా పట్టించుకోలేదు. 

సెల్ఫీ కోసం రూల్స్ బ్రేక్ చేసిన అమృత ఫడ్నవీస్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్‌ చేస్తుంటే మరికొందరు ఆమెను తప్పుబడుతున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌