మందు బాబులకు షాక్.. బీర్ల ధరకు రెక్కలు

By ramya neerukondaFirst Published Oct 16, 2018, 1:06 PM IST
Highlights

చాలామందికి ఎంతో ప్రియమైన బీరు ధర కు రెక్కలు వచ్చాయి. వాటి ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి

మద్యం ప్రియులకు ఇది  చేదు వార్తే. ఎందుకంటే.. చాలామందికి ఎంతో ప్రియమైన బీరు ధర కు రెక్కలు వచ్చాయి. వాటి ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఇందుకు కారణం ఏంటో తెలుసా..? వాతావరణంలో మార్పులు. వాతావరణానికి.. బీరుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

వాతావరణంలో విపరీతంగా పెరిగిపోతున్న వేడి తద్వారా ఎదురవుతున్న కరవు పరిస్థితుల కారణంగా బీరు తయారీలో ప్రధాన పదార్థమైన బార్లీ పంట సాగు, దిగుబడి తగ్గిపోతోంది. ఈ వాతావరణ సమస్యలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా బీరు తయారీ, సరఫరా బాగా తగ్గిపోతుందని ఓ ప్రముఖ వార్తా సంస్థ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఈ నివేదికను ప్రకృతిపై పరిశోధనలు జరిపే నేచర్‌ ప్లాంట్స్‌ వార్తా సంస్థ ప్రచురించింది.

దీని ప్రకారం గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సరాసరిన మూడు నుంచి 17 శాతం బార్లీ పంట దిగుబడి తగ్గిపోతోంది. ఇదే కొనసాగితే బీర్ల ధరలు పెరగడం ఖాయమని నివేదిక వెల్లడించింది. ఈ వాతావరణ సమస్యలు, విపత్తుల కారణంగా భవిష్యత్తులో బీరు ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడనుందని వెల్లడించింది.
 

click me!