కుళ్లిన స్థితిలో జర్నలిస్టు శవం..ఆలస్యంగా వెలుగులోకి

By ramya neerukondaFirst Published Oct 16, 2018, 11:45 AM IST
Highlights

కుళ్లిన స్థితిలో ఓ జర్నలిస్టు మృతదేహం బయటపడిన సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది. 


కుళ్లిన స్థితిలో ఓ జర్నలిస్టు మృతదేహం బయటపడిన సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బబితా బసు(52) అనే మహిళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.  20నెలలుగా ఆమె నోయిడాలో ని ఓ ఫ్లాట్ లో ఒంటరిగా నివసిస్తోంది.

ఆమె కుమారుడు బెంగళూరులో ఓ ఫ్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా.. ఆమెకు గత కొంతకాలంగా డయాలసిస్ తో బాధపడుతోంది. కిడ్నీ ట్రాన్సపరెంట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. అందుకోసం గేతడాది చెన్నై కూడావెళ్లింది. కానీ.. ఆమెకు కిడ్నీ ఇచ్చేవారు ఎవరూ దొరకలేదు.

అయితే.. గత 25రోజులు గా ఆమె ఆఫీసుకు వెళ్లడం లేదు. అనారోగ్యం కారణంగా రాలేదని వారు భావించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. గత ఆదివారం ఆమె ఇంటి యజమాని.. రెంట్ అగ్రిమెంట్ రెన్యువల్ చేసుకునేందుకు బబిత ఫ్లాట్ వద్దకు వచ్చింది. డోర్ ఎంత సేపు కొట్టినా ఆమె స్పందించలేదు.

ఫోన్ చేసినప్పటికీ ఆమె వాటికి కూడా స్పందించలేదు. అంతేకాకుండా ఆ ఫ్లాట్ నుంచి దుర్వాసన బయటకు రావడంతో.. వెంటనే ఆమె బెంగళూరులోని ఆమె కుమారుడికి ఫోన్ చేసింది. అయితే.. తన ఫోన్ కి కూడా తల్లి స్పందించడం లేదని అతను వివరించాడు. వెంటనే బెంగళూరు నుంచి బయలుదేరి నోయిడా కి చేరుకున్నాడు.

పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారి సమక్షంలో ఫ్లాట్ తలుపులు పగలకొట్టాడు. తీరా గదిలోకి వెళ్లి చూడగా.. ఆమె కుళ్లిన స్థితిలో చనిపోయి కనిపించింది. ఆమె చనిపోయి అప్పటికే మూడు వారాలు అయ్యి ఉంటుందని పోలీసులు భావించారు. అనారోగ్యం కారణంగానే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!