పేపర్, ప్లాస్టిక్ కప్పులు బంద్: ఇకపై మట్టి కప్పుల్లోనే టీ

By Siva KodatiFirst Published Aug 26, 2019, 6:10 PM IST
Highlights

100 రైల్వే స్టేషన్‌లు, ఎయిర్‌పోర్టులు, బస్‌డిపోల వద్ద వున్న టీ స్టాళ్లలో మట్టికప్పుల్లోనే టీని అందించడాన్ని తప్పనిసరి చేయాలంటే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.... రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు లేఖ రాశారు

దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్‌ వద్ద వున్న స్టాళ్లలో ఇకపై మట్టికప్పులో టీ రుచిని దేశ ప్రజలు ఆస్వాదించవచ్చు.

సుమారు 100 రైల్వే స్టేషన్‌లు, ఎయిర్‌పోర్టులు, బస్‌డిపోల వద్ద వున్న టీ స్టాళ్లలో మట్టికప్పుల్లోనే టీని అందించడాన్ని తప్పనిసరి చేయాలంటే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.... రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు లేఖ రాశారు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, వారణాసి రెండు రైల్వే స్టేషన్‌లలో మాత్రమే కేటరర్లు మట్టి కప్పుల్లో టీని అందిస్తున్నారు. దీని ద్వారా స్థానిక తయారీదారులకు మార్కెట్ లభించడంతో పాటు పర్యావరణానికి హానీ కలిగించే పేపర్, ప్లాస్టిక్ వాడకం తగ్గించినట్లవుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

కాగా.. పదిహేనేళ్ల కిందట లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైళ్లలో ప్రయాణీకుల కోసం టెర్రకోట మట్టితో తయారు చేసిన టీ కప్పులు, ప్లేట్లు ప్రవేశపెట్టారు.

మట్టిపాత్రలు తయారు చేసేవారికి ఉపాధి లభిస్తుందనే ఉద్దేశ్యంతో ఈ విధానాన్ని లాలూ అమల్లోకి తెచ్చారు. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.. అయితే మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానం కనుమరుగైంది. 

click me!