ఈ‌వ్‌టీజింగ్ చేస్తుంటే జనాన్ని పిలిచిందని: తలపై బైక్‌ నడిపి...

Siva Kodati |  
Published : Aug 19, 2019, 07:56 AM IST
ఈ‌వ్‌టీజింగ్ చేస్తుంటే జనాన్ని పిలిచిందని: తలపై బైక్‌ నడిపి...

సారాంశం

రోజు రోజుకి మనిషిలో మానవత్వం కనుమరుగైపోతోంది. ఇందుకు సంబంధించి ప్రతి నిత్యం ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలిక దుండగుల చేతిలో బలైంది

రోజు రోజుకి మనిషిలో మానవత్వం కనుమరుగైపోతోంది. ఇందుకు సంబంధించి ప్రతి నిత్యం ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలిక దుండగుల చేతిలో బలైంది.

వివరాల్లోకి వెళితే... సుల్తాన్‌పూర్‌లో ఆదివారం పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి తిరిగి వెళుతున్న బాలికను అదే సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు వెంటాడారు. అసభ్య పదజాలంతో ఆమెను వేధించారు.

దీంతో భయపడిపోయిన బాలిక కేకలు విసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఆకతాయిలు పారిపోయారు. దీనిని అవమానంగా భావించిన ఆ ముగ్గురు పోకిరీలు పగతో రగిలిపోయారు.

కాసేపటికే వెనక్కి తిరిగి వచ్చి... బాలికను చుట్టుముట్టారు. ఆమెను నేలపై కదలకుండా పడుకోబెట్టగా.. మరొకడు బాలిక తల మీదుగా బైక్ నడిపాడు. తీవ్రగాయాలు కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

సమాచారం అందుకున్న బాధితురాలి తాత ఆమెను హుటాహుటిన లక్నోలోని కేజీఎంయూ ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు చికిత్సకు నిరాకరించారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో బాలికను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణిచింది. కాగా.. ఇంతటి దారుణం జరిగినా పోలీసులు సైతం కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ