భారత్‌లో సీజేపీ నిరసనలపై స్పందించిన అమెరికా .. విదేశాంగ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

Published : Oct 21, 2026, 06:41 PM IST
CJP

సారాంశం

CJP: భారత్‌లో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ఈ నిరసనలు భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోబోదన్నారు.

భారత్ అంతర్గత వ్యవహారమన్న మార్కో రూబియో

ప్ర‌స్తుతం భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌లో జరుగుతున్న నిరసనలపై ప్రశ్నించగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భారతదేశానికి సంబంధించిన అంతర్గత విష‌య‌మ‌ని, ఇందులో అమెరికా జోక్యం చేసుకోదని తెలిపారు. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. అమెరికాలోనూ ప్రతిరోజూ వివిధ అంశాలపై ప్రజలు నిరసనలు చేపడుతుంటారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో నిరసనలు సాధారణమేనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

భారత్‌కు మద్ధతుగా అమెరికా వైఖరి

భారత్‌లో నిరసనలపై కొందరు అమెరికా చట్టసభ సభ్యులు విమర్శలు చేస్తున్నారు. పోలీసుల చర్యలు, మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన కొందరు వ్యక్తులు సైతం ఈ అంశాలను ప్రస్తావించారు. అయితే, ఈ విమర్శలపై మార్కో రూబియో స్పందించిన తీరు ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను ఆ దేశ అంతర్గత రాజకీయ అంశంగా అభివర్ణించారు.

మానవ హక్కుల అంశంపై భారత్ అభ్యంతరం

భారత్‌లో నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలు, మానవ హక్కుల పరిస్థితులపై ఐక్యరాజ్యసమితికి చెందిన కొందరు ప్రత్యేక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ అభ్యంతరాలను భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మానవ హక్కుల అంశాలను కొన్ని దేశాలపై రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగించకూడదని భారత్ అభిప్రాయపడింది. కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని పేర్కొంది. సరైన విచారణ జరగని ఆరోపణల ఆధారంగా ఒక దేశ పరిస్థితులపై నిర్ణయానికి రావడం సమంజసం కాదని స్పష్టం చేసింది. మానవ హక్కులపై చర్చలు వాస్తవాలు, ఆధారాల ఆధారంగా జరగాలని భారత్ చెబుతోంది.

ఇంత‌కీ సీజేపీ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?

కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో భారత్‌లోని పలు నగరాల్లో నిరసనలు జరుగుతున్న విష‌యం తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR)లో త‌ప్పులు జ‌రిగాయ‌ని సీజేపీ ఆరోపిస్తోంది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ నిరసనకారులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది.

నిరసనలకు ప్రతిపక్ష పార్టీల మద్దతు

సీజేపీ చేపడుతున్న నిరసనలకు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పాటు ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఈ నిరసనలు, పోలీసుల చర్యలు, మానవ హక్కుల అంశాలు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భారత్‌లోని నిరసనలను అంతర్గత రాజకీయ వ్యవహారంగా పేర్కొంటూ, ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అప్ప‌టి వరకు నిరసనలు వద్దు.. కుటుంబాలతో గ‌డ‌పండి: అభిజీత్ దీప్కే
Kolkata Stampede: దుర్గామాత మండపంలో 19 మంది మృతి.. కోల్‌కతా విషాదానికి కారణం ఏమిటి?