కమిటీ సభ్యులను కించపరుస్తారా?: రైతు సంఘాలపై సుప్రీం ఆగ్రహం

By narsimha lodeFirst Published Jan 20, 2021, 3:56 PM IST
Highlights

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏర్పాటు చేసిన కమిటీపై కొందరు రైతు సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.


న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏర్పాటు చేసిన కమిటీపై కొందరు రైతు సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

బుధవారం నాడు  కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు గతంలో స్టే విధించిన విషయం తెలిసిందే.  దీంతో పాటు సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని రైతు సంఘాలు ఆరోపించాయి. కమిటీ నుండి వైదొలుగుతున్నట్టుగా భూపీందర్ సింగ్ మాన్ ప్రకటించారు.

భూపీందర్ సింగ్ మాన్ స్థానంలో మరొకరిని నియమించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ సమయంలో రైతు సంఘాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

పలు రంగాల్లో నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు.ఈ కమిటీకి తాము ఎలాంటి నిర్ణయాధికారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వంతో పాటు రైతు సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు గాను ఈ కమిటీ చర్చించనుందని సుప్రీంకోర్టు తెలిపింది. కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలు చెప్పకుండా కమిటీపైనే నిందలు వేయడం సరైంది కాదన్నారు.

ఎదుటి వారి వాదనలు విన్న తర్వాత ఒక్కోసారి స్వంత అభిప్రాయాలు కూడ మారిపోతుంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్ పై తమ స్పందన  తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది.
 

click me!