రోడ్డూడ్చిన మహిళా పోలీస్.. వీడియో వైరల్!

By AN TeluguFirst Published Jan 20, 2021, 2:32 PM IST
Highlights

ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు ఊడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూనె, తిలక్ రోడ్ లో ఓ యాక్సిడెంట్ జరిగింది. బైక్ అద్దాలు, ప్లాసిక్ ముక్కలతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఆ రోడ్డులో ప్రయాణించే మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దని ఆ మహిళా కానిస్టేబుల్ స్వయంగా చీపురు పట్టి రోడ్డు ఊడ్చేసింది.

గాజుపెంకులు, ప్లాస్టిక్ ముక్కలు ఎత్తేసి వాహనదారులకు మార్గం సుగమం చేసింది. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అమల్దార్ రజియా సయ్యద్ చేసిన ఈ పనిని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

స్వీపర్స్ వచ్చేదాకా వేచి చూడకుండా స్వయంగా శుభ్రం చేయడానికి పూనుకుందంటూ ఆమెకు ప్రశంసల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కూడా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

"వాహనదారులకు అసౌకర్యం కలగకుండామహిళా పోలీసులు అమల్దార్ రజియా సయ్యద్ చొరవ తీసుకున్నారు యాక్సిడెంట్ వల్ల రోడ్డు మీద పడ్డ గాజుపెంకులు, ప్లాస్టిక్ ముక్కలను ఆమె చీపురుతో  శుభ్రం చేశారు. పౌరుల భద్రత కోసం ఆమె చేసిన పని ఆదర్శప్రాయమైనది" అంటూ దేశ్ ముఖ్ ప్రశంసించారు. అంతేకాదు ఈ వీడియోను @PuneCityPolice, @CPPuneCity లకు ట్యాగ్ చేశాడు.

పౌరుల భద్రత కోసం రహదారిని శుభ్రం చేసి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె చొరవకు మెచ్చుకున్న నగర పోలీసులు సయ్యద్‌ను ఖాదక్ ట్రాఫిక్ విభాగంలోకి పోస్ట్ చేశారు.

click me!