ఆ పనిని 20 ఏళ్ల వయసులోనే చేశా ..: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ 

By Rajesh KarampooriFirst Published Dec 6, 2022, 4:13 PM IST
Highlights

భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మూన్ లైటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ వైపు లాయర్ గా పని చేస్తూ..  ఆల్ ఇండియా రేడియోలో ‘ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వెస్ట్’ వంటి షోలలో వ్యాఖ్యత  పని చేస్తున్నట్టు వెల్లడించారు.

ఒక ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం పార్ట్‌టైమ్‌గా మరో జాబ్‌ చేయడమే ‘మూన్‌ లైటింగ్‌’. ఈ పదం ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కేరీర్  ప్రారంభంలో తాను కూడా మూన్‌ లైటింగ్‌ చేశానని వెల్లడించారు. తొలినాళ్లల్లో ఆల్ ఇండియా రేడియోలో వెన్నెల వెలుగులు నింపేవాడిని, అనేక కార్యక్రమాలకు యాంకర్ ,హోస్ట్ చేసేవాడినని తెలిపారు. 
 
ఇటీవల గోవాలోని న్యాయవిశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో వేడుకలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తానూ'మూన్‌లైటింగ్'చేశానని, తనకు చట్టంతో పాటు సంగీతంపై కూడా ప్రత్యేక ఆసక్తి ఉందన్నారు. తాను 20-30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లాయర్‌గా పని చేస్తూ..  ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్‌లను హోస్ట్ చేసేవాడినని చెప్పాడు.'ప్లే ఇట్ కూల్', డేట్ విత్ యూ','సండే రిక్వెస్ట్' వంటి కార్యక్రమాలను తాను హోస్ట్ చేశానని సీజేఐ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.

ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. తరుచు సంగీతం వింటాననీ,  సంగీతం పట్ల ఆసక్తి  ఈనాటికీ కొనసాగుతుందనీ, తన దినచర్యలో సంగీతం ఇమిడిపోతుందని అన్నారు. విద్యార్థులు నిత్యం ఆసక్తిగా ఉండాలని కోరారు. 'మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తనను తాను తెలుసుకోవాలనే నిరంతర తపన ఉండాలి. మీరు ఆ శోధనను ముందుగానే ప్రారంభించాలి. మీ ఆత్మ,  మీ మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని అన్నారు. ఇందుకు సంబంధించిన  వీడియోను బార్ అండ్ బెంచ్ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. 

అయోధ్య, శబరిమల వంటి తీర్పుల్లో సీజేఐ డివై చంద్రచూడ్ కీలక పాత్ర పోషించారు. అతను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. బాంబే హైకోర్టులో జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు.ఆయన  2000లో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు, తర్వాత అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 

click me!