మహిళా ఏసీపీ చేతి వేళ్లు నరికేసిన వీధి వ్యాపారి..!

Published : Sep 01, 2021, 07:38 AM IST
మహిళా ఏసీపీ చేతి వేళ్లు నరికేసిన వీధి వ్యాపారి..!

సారాంశం

 ఘోడ్ బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా,. అక్కడ ఘర్షణ తలెత్తింది.

మహిళా ఏసీపీ అధికారి పట్ల చిరు వ్యాపారులు దారుణంగా ప్రవర్తించారు. అక్రమ దుకాణాలు ఏర్పాటుచేసుకున్నారని.. వాటిని ఖాళీ చేయించడానికి వెళ్లిన  పోలీసులపై వ్యాపారులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీసు కమిషనర్ కల్పితా పింపుల్ చేతి మూడి వేళ్లు తెగిపడిపోయాయి.

రోడ్లు, ఫుట్ పాత్ లపై అక్రమంగా దుకాణాలు ఏర్పరుచుకున్న వీధి వ్యాపారులపై ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలను, తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్ బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా,. అక్కడ ఘర్షణ తలెత్తింది.

ఈ క్రమంలో ఏసీపీపై కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ కత్తితో దాడి చేశాడు. దీంతో కల్పితా పింపుల్ మూడు వేళ్లు తెగిపడ్డాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీతో పాటు ఉన్న సెక్యురిటీ గార్డు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దాడి కేసులో నిందితుడు అమర్జీత్ ను పోలీసులు అరెస్టు చేశారు.

అతడిపై హత్యాయత్నం కేసు సహా ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ వినయ్ రాథోడ్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?