ఉదయనిధి స్టాలిన్ కు ప్రకాష్ రాజ్ బాసట: సోషల్ మీడియాలో పోస్టులు

Published : Sep 04, 2023, 11:44 AM ISTUpdated : Sep 04, 2023, 04:40 PM IST
ఉదయనిధి స్టాలిన్ కు ప్రకాష్ రాజ్ బాసట: సోషల్ మీడియాలో  పోస్టులు

సారాంశం

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్  సినీ నటుడు, ప్రకాష్ రాజ్ మద్దతుగా నిలిచారు.

చెన్నై: తమిళనాడు మంత్రి  ఉదయనిధి స్టాలిన్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు ప్రకటించారు. ఈ నెల  2వ తేదీన  తమిళనాడు రాష్ట్రంలో జరిగిన  ఓ సమావేశంలో  తమిళనాడు  సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు  కలకలం రేపుతున్నాయి.  డెంగ్యూ, మలేరియా, కరోనాను  నిర్మూలించాలి...అదే విధంగా  సనాతన ధర్మాన్ని కూడ నిర్మూలించాలని ఆయన  వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు  ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారాయి.  

ఇదిలా ఉంటే  తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు మద్దతుగా  సినీ నటుడు ప్రకాష్ రాజ్ నిలిచారు.  ప్రియమైన పౌరులారా ఇది భవిష్యత్తుకు అవకాశం... దీనికి మీరు అంగీకరిస్తున్నారా అని  ప్రశ్నించారు.పలువురు  సన్యాసులతో  ప్రధాని మోడీ  దిగిన  ఫోటోను  ఆయన  ఈ పోస్టుకు జత చేశారు.  

also read:'రాహుల్ గాంధీకి పరీక్షా సమయం' ఉదయనిధి వివాదాస్పద ప్రకటనపై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు

ఈ నెల  3వ తేదీ నుండి ప్రకాష్ రాజ్ ఈ విషయమై  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సనాతనవాదులను  మానవ వ్యతిరేకులుగా  పేర్కొన్నారు. అంబేద్కర్, పెరియార్ ఫోటోలను కూడ  నిన్న  ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. హిందూవులు తిరుగుబాటు దారులు కాదని ఆయన వ్యాఖ్యానించారు.

 

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 2014లో  ఎంత ఉండేది,  ప్రస్తుతం ఎంత ఉన్నాయనే అంశాలకు  సంబంధించి ఓ నెటిజన్ తన అకౌంట్ లో  ప్రస్తావించిన  అంశాలను  ప్రకాష్ రాజ్ షేర్ చేశారు. అంతేకాదు  ఈ విషయమై ప్రధాని మోడీపై  వ్యంగ్యాస్త్రాలను ఆయన సంధించారు.సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతుంది.ఈ విషయమై  తమిళనాడు గవర్నర్ కు  ఇవాళ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.  ఉదయనిధి స్టాలిన్ పై  చర్యలు తీసుకోవాలని కోరారు.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడ  ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు.  ఇండియా కూటమి  వైఖరి తేటతెల్లమైందని  అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!